ఈ మధ్యకాలంలో ప్రేమించడం అంత కామన్ గా జరుగుతుందో..అంతే త్వరగా బ్రేకప్ లు చెప్పేస్తున్నారు. అదేంటో తెలియదు కానీ చూసి చూడంగానే నచ్చేసావే అంటూ ఐ లవ్ యు చెప్పేసి ..వీలైనంత తొందరగా వాళ్ళ సరదాలు తీర్చేసుకుని ..ఇక ఆ తర్వాత బాండింగ్ లేదు ..తోటకూర కట్టలేదు అంటూ కటీఫ్ చెప్తున్నారు. అలా బ్రేకప్ చెప్పేసుకున్న జంటలు ఎంతోమంది ఉన్నారు .
రీసెంట్గా ప్రముఖ సింగర్ ప్రతీక్ తన గర్ల్ ఫ్రెండ్ నిహారిక ఠాకూర్ తో విడిపోయినట్లు అఫీషియల్ గా ప్రకటించాడు . గత కొన్ని రోజులుగా వీళ్ళు విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నా జనాలు లైట్‌గా తీసుకున్నారు . కానీ ఆయన స్వయంగా ప్రకటించడంతో ఫాన్స్ ఫీల్ అయిపోతున్నారు. ఇంస్టాగ్రామ్ వేదిక సింగర్ ప్రతీక్ కుమార్.. నిహారిక తో విడిపోతున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ..” నిజానికి మేము ఎప్పుడో విడిపోయామని ..కొంత కాలంగా మా మధ్య మాటలు లేవని ..నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని ..మా మధ్య జరిగిన విషయాలన్నీ ముగిసిపోయాయని ..ప్రజెంట్ నేను సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నానని ..ఈ బంధం ముగిసిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అంతే కాదు సంగీతం మరింత బాగా ఎంజాయ్ చేస్తున్నానని కూడా చెప్పాడు. దీంతో వీళ్ళ ఫాన్స్ బాధపడుతున్నారు. గతంలో ప్రతిక్- నిహారిక చేసిన వీడియోస్ ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో తెలిసిందే. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి గిటార్ ప్లే చేసిన వీడియో జనాలకు మరింతగా నచ్చేసింది . అయితే ప్రజెంట్ సింగిల్‌గా గిటార్ ప్లే చేస్తున్నాడు ప్రతీక్.