టాలీవుడ్ .. సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని అక్కినేని నాగేశ్వరరావు సంపాదించి పెట్టారు. ఆ పేరును కంటిన్యూ చేస్తూ వస్తున్న నాగార్జున ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. కొన్ని ఆయన ఫ్యామిలీ రీజన్స్ కారణంగా అయితే మరికొన్ని ఆయన చేసే బిగ్ బాస్ షో కూడా అని తెలుస్తుంది.
కాగా రీసెంట్గా తమిళ బిగ్ బాస్ లో హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ ని ఓ రేంజ్ లో పొగడేస్తున్న వీడియోలు హ్యాష్ ట్యాగ్లు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి . ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కోసం నిలబడినందుకుగాను ప్రేక్షకులు కమలహాసన్ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు . మనకు తెలిసిందే బిగ్ బాస్ లో ట్రాన్స్ ఉమెన్ కంటెస్టెంట్ శివానిని తోటి సభ్యుడు అజీమ్ ఎగతాళి చేశారు. ఈ కారణంగానే కమలహాసన్ స్టాండ్ తీసుకొని నిలబడడం గ్రేట్ అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ట్విట్స్ చేస్తూ అభినందిస్తున్నారు.
అయితే అదే సమయంలో నాగార్జునను ఏకీపారేస్తున్నారు . “నువ్వు ఫ్యామిలీలో కొడుకుని చక్కదిద్దుకోవడం తెలియదు ..ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు స్టాండ్ తీసుకోవడం తెలియదు ..బిగ్ బాస్ లో హోస్ట్ గా మేనేజ్మెంట్ వెనకాల స్క్రిప్ట్ ఇస్తే అది చదవడం మాత్రమే తెలుసు.. నిజాయితీగా నిజంగా గేమ్ ఆడిన కంటెస్టెంట్స్ ని ఎప్పుడైనా పొగిడావా..? ఎప్పుడు అందాల భజన గాని నీకు.. ఇంకా మిగతా పనులు లేవా ..నువ్వు పిరికి వాడివి..నిజాన్ని ధైర్యంగా చెప్పే ధైర్యం నీకు లేదు ..ఏమైనా సరే నాగార్జున టైం అసలు బాగలేదు అంటున్నారు జనాలు.