Moviesఎన్టీఆర్ సినిమాకు మ‌రో క‌ష్టం.. అంతా కొర‌టాల చేసిన త‌ప్పువ‌ల్లే...!

ఎన్టీఆర్ సినిమాకు మ‌రో క‌ష్టం.. అంతా కొర‌టాల చేసిన త‌ప్పువ‌ల్లే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఐదారు నెలలుగా వార్తల్లో నానుతూనే వుంటూ వస్తోంది. దర్శకుడు శివ ఇన్నీ రోజులు గ‌డుస్తున్నా కూడా ఇంకా స్క్రిప్ట్ వర్క్ చేస్తూ సాగ‌దీస్తూ వ‌స్తున్నాడు. అస‌లు సినిమా ఇప్ప‌ట్లో సెట్స్ మీద‌కు వెళుతుందా ? అన్న డౌట్లు చాలా మందికి ఉన్నాయి. మ‌రోవైపు త్రిబుల్ ఆర్ కోసమే ఏకంగా మూడున్న‌రేళ్లు వెయిట్ చేసిన ఎన్టీఆర్ ఆ వెంట‌నే అయినా సినిమా స్టార్ట్ చేస్తాడ‌నుకుంటే మ‌రింత ఆల‌స్యం అవుతోంది.

కొరటాల చేస్తున్న తప్పులే ఈ సినిమాకు శాపంగా మారుతున్నాయి అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆచార్య డిజాస్టర్ అవడంతో కొరటాల ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో ఎన్టీఆర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న‌ కసితో కథలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాడు. దీంతో సినిమా పట్టాలు ఎక్కే విషయంలో చాలా ఆలస్యం అవుతోంది. పైగా సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలన్న ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇప్పటికి హీరోయిన్ ఎవరో తెలియని పరిస్థితి. ఐదారు నెలలుగా కొరటాల హీరోయిన్ నే ఎంపిక చేయలేకపోయాడు. ఎట్టకేలకు జాన్వీ కపూర్ పేరు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.

కొర‌టాల ఫైన‌ల్ స్క్రిఫ్ట్ లాక్ చేస్తే వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి అయినా ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంద‌ని అంటున్నారు. అస‌లే ఈ సినిమాకు అన్నీ ఆల‌స్యం అవుతున్నాయ‌నుకుంటే ఇప్పుడు మ‌రో క‌ష్టం వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఫైనాన్షియ‌ల్ క‌ష్టాలు స్టార్ట్ అయ్యాయ‌ట‌. ఆచార్య సినిమా కోసం చిరు – కొర‌టాల అన‌గానే పెద్ద ఎత్తున ఇన్వెస్ట‌ర్లు అమౌంట్ ఇచ్చారు. సినిమాను భారీ రేట్ల‌కు అమ్మారు. తీరా సినిమా కొన్న వాళ్లు గ‌ట్టిగా న‌ష్ట‌పోవ‌డం.. కొర‌టాల‌, చిరు నానా తిప్ప‌లు ప‌డ‌డం అంద‌రూ చూశారు.

అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత ఫామ్‌లో ఉన్నా.. ఆచార్య డిజాస్ట‌ర్ త‌ర్వాత కొర‌టాల చేస్తోన్న సినిమా కావ‌డం ఒక మైన‌స్ అయితే… ఇటు క‌థ‌లో మార్పులు… ఆరు నెల‌లుగా సినిమా ప‌ట్టాలు ఎక్క‌కుండా నాన్చుతూ వ‌స్తూ ఉండ‌డం.. ఎన్టీఆర్ కూడా ఒకానొక ద‌శ‌లో కొర‌టాల‌పై అస‌హ‌నంతో ఉన్నాడ‌న్న వార్త‌ల‌కు తోడుగా ఇప్పుడు ఈ సినిమాకు ఫైనాన్స్ ప్రాబ్ల‌మ్స్ కూడా త‌లెత్తాయంటున్నారు.

ఎన్టీఆర్ సినిమాకు ఫండింగ్ స‌మ‌స్యా ? అన్న సందేహం వ‌స్తుంది. కానీ కొర‌ట‌ల‌పై చాలా మందికి న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో పాటు సినిమా చాలా డిలే అవుతుండ‌డంతో న‌మ్మ‌కాలు స‌న్న‌గిల్లుతున్నాయి. అందుకే ఏరియాల వారీగా ఇప్ప‌టి నుంచే డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి అడ్వాన్స్‌లు అడుగుతుండ‌డంతో పాటు కొర‌టాల త‌న స‌న్నిహితులు ద్వారాను, అటు అమెరికాలో తెలిసిన వారి నుంచి భారీగా ఫండింగ్ స‌మ‌కూర్చే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నాట్ట‌..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news