Moviesఆ టాలీవుడ్ హీరో ఇంట్లో అర్ధ‌రాత్రి అమ్మాయిలు... మార్వాడీ, అయ్యంగార్ అమ్మాయిలతో...

ఆ టాలీవుడ్ హీరో ఇంట్లో అర్ధ‌రాత్రి అమ్మాయిలు… మార్వాడీ, అయ్యంగార్ అమ్మాయిలతో ఎంజాయ్‌..!

సినిమా రంగం అనేది గ్లామర్ ఫీల్డ్ ఇక్కడ టాలెంట్ తో పాటు అందం అనేది కూడా అవకాశాలు రావటంలోనూ… స్టార్లుగా ఎదగడంలోనూ కీలకపాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప హీరో అయినా.. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత బాగా ఫైట్లు, డ్యాన్సులు చేసినా అంతకు మించిన అందం కూడా ఉండాలి. తెరమీద కనిపించేది అంతా అందమే.. అందుకే హీరోలు, హీరోయిన్లు ఎంత గొప్ప అందంతో ఉంటే అంత బాగా వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే కొందరికి స్టార్లుగా ఎదగడంలో ఈ అందం ఎంత కీలకపాత్ర పోషిస్తుందో… అదే అందం వారిని పతనావస్థ‌కు కూడా తీసుకు వెళుతుంది.

 

అందం అనేదానిని మంచి అవకాశాలు అందిపుచ్చుకోవటంలోనూ.. స్టార్లుగా ఎదిగేలా వాడుకోవటంలోనూ ఉపయోగించుకోవాలి తప్ప.. అందం ఉన్నదని మనం దానిని బలహీనతగా ఇప్పుడు మార్చుకోకూడదు. అప్పుడే అది పతనం దిశగా నడిపిస్తుంది. టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల క్రితం హరినాథ్ అని సీనియర్ హీరో ఉన్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలోని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన హరినాథ్ రాజు ఆరు అడుగుల పొడవుతో చూడ చక్కని రూపంతో ఎంతో అందంగా ఉండేవారు. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ కు పోటీగా హరినాథ్ సినిమాలు చేసి హిట్లు కొట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో చదువుకున్న హరినాథ్ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే నాటకాలు వేసేవారు. అప్పట్లోనే ఆయనకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. కళాశాలలో కూడా ఆయన గ్యాంగ్ లీడర్ గా ఉండేవారు. కాలేజ్ గొడ‌వ‌ల్లో హ‌ర‌నాథ్ టాప్‌. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే హరినాథ్ అంటే అమ్మాయిలు ప్రాణం ఇచ్చే వాళ్ళు. ఈ క్రమంలోనే నాటకాల ద్వారా సక్సెస్ అయిన హర‌నాథ్‌ను అప్పటి డైరెక్టర్లు చూసి ఆయనలో టాలెంట్ గుర్తించి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. దీంతో హరినాథ్ మద్రాస్ కు షిఫ్ట్ అయ్యారు.

అక్కడ అతి తక్కువ కాలంలోనే సినిమా రంగంలో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ క్రమంలోనే కొన్ని బలహీనతలు కూడా హర‌నాథ్‌ను చుట్టుముట్టాయి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ తెచ్చుకున్న హర‌నాథ్ అంతే వేగంగా పాతాళడానికి పడిపోయాడు. త‌న‌కు వ‌చ్చిన క్రేజ్‌తో పాటు ఆయ‌న అందానికి ప‌డ‌పోయిన అమ్మాయిలు ఆయ‌న్ను చుట్టుముట్టేవారు. ఆయ‌న షూటింగ్‌లో ఉండ‌గానే అమ్మాయిలు వ‌చ్చేసి ఆయ‌న్ను వాటేసుకుని హంగామా చేసేవార‌ట‌. అందుకే ఎన్టీఆర్ సీతారామ క‌ళ్యాణంలో న‌టించేట‌ప్పుడు కూడా అమ్మాయిలు నీ కోసం సెట్‌లోకి రాకూడ‌ద‌న్న కండీష‌న్ పెట్టి మ‌రీ ఆయ‌న‌కు ఛాన్స్ ఇచ్చార‌ట‌.

అయితే హ‌ర‌నాథ్ రాత్రి ఇంటికి వెళ్లాక అమ్మాయిల‌తో విప‌రీతంగా తెల్లార్లూ తాగుతూ ఎంజాయ్ చేసేవార‌ట‌. ఒకేసారి ఐదారుగురు అమ్మాయిలు హ‌ర‌నాథ్‌ను చుట్టుముట్టేసి పార్టీలు చేసుకుంటూ.. మందు తాగుతూ డ్యాన్సులు చేస్తూ హ‌ర‌నాథ్‌ను మ‌రో మైకంలోకి తీసుకువెళ్లేవార‌ట‌. ఇక హ‌ర‌నాథ్ కోసం చెన్నైలో ఉండే ధ‌న‌వంతులు అయిన మార్వాడీ అమ్మాయిలు, అయ్యంగార్ ఫ్యామిలీల అమ్మాయిలు వెళ్లేవార‌ట‌. అక్క‌డ రాత్రంతా ర‌క‌ర‌కాలుగా ఎంజాయ్ చేసేవార‌ట‌.

అలా మ‌త్తుతో పాటు అమ్మాయిల మైకంలో ప‌డిపోయిన హ‌ర‌నాథ్ షూటింగ్‌ల‌కు స‌రిగా వెళ్లేవాడు కాదు. ఇదే చివ‌ర‌కు ఆయ‌నకు ఛాన్సులు లేకుండా పోవ‌డానికి.. ఆయ‌న కెరీర్ దెబ్బ‌తిన‌డానికి కార‌ణ‌మైంది. లేకుంటే హ‌ర‌నాథ్ కొన్నేళ్ల పాటు ఎన్టీఆర్‌, ఏఎన్నార్ రేంజ్‌లో గొప్ప‌గా వెలుగొందేవాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news