Moviesఈ లవ్లీ బ్యూటీ ఆశ‌లు మంచు విష్ణు అడియాస‌లు చేసేశాడా...!

ఈ లవ్లీ బ్యూటీ ఆశ‌లు మంచు విష్ణు అడియాస‌లు చేసేశాడా…!

లవ్లీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది శాన్వీ శ్రీవాత్సవ. అసలు పేరు శాంభవి శ్రీవాత్సవ. సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం శాన్వీ అనే పేరుతో. ఈ పేరు దివంతగ సీనియర్ దర్శకురాలు బి జయ పెట్టారు. మొదటి సినిమాతో యూత్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో వరుసగా అమ్మడికి యువ కథానాయకుల సరసన అవకాశాలు దక్కించుకుంటుందని అందరూ భావించారు. కానీ, ఆ రేంజ్‌లో శాన్వీకి ఎందుకనో అవకాశాలు దక్కలేదు.

లవ్లీ తర్వాత ఈ యంగ్ బ్యూటీకి అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన అడ్డా అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత కన్నడ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. అయితే, మొదటి రెండు సినిమాలు శాన్వీకి గుర్తింపునైతే బాగానే తెచ్చాయి గానీ, భారీ చిత్రాలలో హీరోయిన్‌గా నటించే అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేదు. అనుకోకుండా మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా మాత్రం గ్లామర్ బ్యూటీగా అందరి దృష్ఠిని ఆగా ఆకర్శించింది.

దీనికి కారణం..సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు హీరోలుగా నటించిన పొలిటికల్ డ్రామా రౌడీ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా శాన్వీ కెరీర్‌ను అమాంతం మార్చేస్తుందని అందరూ ఆ సమయంలో చెప్పుకున్నారు. దీనికి కారణం పెద్ద కాస్టింగ్, పెద్ద దర్శకుడు. వర్మ్ సినిమా అంటే ఆర్టిస్టులందరికీ మంచి క్రేజ్ వస్తుంది. కానీ, శాన్వీ బ్యాడ్ లక్ లవ్లీ తర్వాత మంచి ఆఫర్స్ అంటూ ఏవీ తెలుగులో రాలేదు.

 

మంచు విష్ణు సినిమా త‌న కెరీర్ ట‌ర్న్ చేస్తుంద‌ని పెట్టుకున్న ఆశ‌లు అడియాస‌లు అయ్యాయి. అడపాదడపా అటు కన్నడలో కూడా సినిమాలు చేసిన శాన్వీ అక్కడ గానీ, టాలీవుడ్ లో గానీ పెద్ద హీరోయిన్ అనిపించుకోలేకపొయారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోషూట్స్ మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలలో పెట్టి వైరల్ చేస్తుంది. ఇప్పటికైనా అదృష్ఠం కలిసివచ్చి మన మేకర్స్ కాస్త కనికరిస్తే ఈ బ్యూటీ అద్భుతమైన పాత్రలు చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news