హీరోయిన్స్ ముద్దుగా బొద్దుగా ఉంటే తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడి ప్రేక్షకులు ఏకంగా గుడి కట్టేస్తారు కూడా. మన టాలీవుడ్లో ఇలాంటి బొద్దుగుమ్మలను పెద్దగా పట్టించుకోరు. ఇలియానా లాంటి నలక నడుమున్న బక్కపలచని పర్సనాలిటీ ఉన్న హీరోయిన్స్ అంటే మహా క్రేజ్ ఉంటుంది. అలాంటి వారికే ఎక్కువగా మన తెలుగు సినిమాలలో హీరోయిన్గా ఛాన్సులు దక్కుతాయి. కేథరీన్ ట్రెసా గురించి అందరికీ తెల్సిందే.
హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా స్టార్ హీరోయిన్గా ఆశించిన సక్సెస్ మాత్రం దక్కలేదు. అయితే, హీరోయిన్గా అడపాదడపా సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది. నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలో మేయిన్ హీరోయిన్ కాకపోయినా కూడా తన మార్క్ పర్ఫార్మెన్స్తో బాగానే నెట్టుకొస్తుంది. అదేంటో కేతరీన్ కెరీర్ ప్రారంభం నుంచి సెకండ్ లీడ్ పాత్రలే దక్కుతున్నాయి. ఇద్దరమ్మాయిలతో సినిమా భారీ సక్సెస్ కాకపోయినా ఇందులో బాగానే పాపులర్ అయింది.
ఆ తర్వాత కొన్ని సినిమాలతో జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత నటించిన సినిమాలలో కూడా కేథరీన్ మేయిన్ హీరోయిన్ కాదు. అయినా ఇన్నేళ్ళుగా కొనసాగుతుందంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. కేథరీన్ అందంగా ఉంటుంది. అందాల ఆరబోతకి ఏమాత్రం కొదవలేదు. నాభి అందాల ప్రదర్శన అదుర్స్ అనిపిస్తుంది. గ్లామర్ పాత్రల్లో మెరిసి మైమరిపిస్తుంది. కిస్సులతోనూ కిర్రెక్కిస్తుంది.
అయినా సెకండ్ లీడ్స్ తప్ప స్టార్ హీరోల సరసన సింగిల్ హీరోయిన్గా ఛాన్సులు దక్కడం లేదు. ఇటీవల బింబిసార సినిమాలో ఓ హీరోయిన్గా నటించింది కేథరీన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. అయినా తనకి సోలో హీరోయిన్గా ఛాన్సులు దక్కడం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా హిట్ పుష్ప సీక్వెల్లో కీలక పాత్ర చేయబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా మేయిన్ హీరోయిన్ కాదు. కీలక పాత్ర మాత్రమే. దీనినిబట్టి చూస్తే ఇక కెథరీన్ కెరీర్ మొత్తం సెకండ్ లీడ్ క్యారెక్టర్స్కే సరిపోయేలా ఉంది.