ఏదేమైనా సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు మంచి బజ్ అయితే ఉంది. ముందుగా రిలీజ్ అవుతోన్న యశోద సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక పబ్లిసిటీ కూడా అదిరిపోయింది. రిలీజ్ హైప్ అయితే మామూలుగా లేదు. ఇక తాజాగా సమంత బయటకు వచ్చి భావోద్వేగానికి గురవ్వడం లాంటి పరిణామాలు కూడా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేందుకు కారణమవుతాయని అంచనాలు ఉన్నాయి.
అయితే ఎంత సింపతీ ఉన్నా.. అక్కడ ఎంత సమంత ఉన్నా సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు వర్కవుట్ అవుతుందన్న సందేహాలు ఉన్నాయి. అసలు చిరంజీవి లాంటి హీరో సినిమాకు హిట్ టాక్ వస్తేనే జనాలు థియేటర్లకు రావడం లేదు. అలాంటిది ఎంత సమంత ఉన్నా… పైగా లేడీ ఓరియంటెడ్ సినిమా కావడంతో థియేటర్లకు వచ్చి ఎంత వరకు చూస్తారు ? అన్న సందేహం ఉండనే ఉంది.
అయితే ఈ సినిమాకు చాలా బడ్జెట్ అయ్యింది. వడ్డీలు, పబ్లిసిటీ ఖర్చులు కలిపి రు. 40 కోట్లు అయ్యిందంటున్నారు. అయితే సినిమాకు రు. 25 కోట్లు కూడా ఖర్చవ్వలేదని.. నిర్మాతకు ఏకంగా రు. 15 కోట్లు మిగిలిందన్న ప్రచారం సమంత పీఆర్ టీం వైపు నుంచి జరుగుతోందన్న చర్చ అయితే ఇండస్ట్రీ ఇన్నర్ వర్గాల్లో ఉంది. శాటిలైట్, హిందీ బిజినెస్ అంటూ వారు ఎన్ని లెక్కలు చూపుతున్నా ఇంకా కొన్ని ఏరియాలు అమ్ముడే కాలేదట.
కర్నాటక హాట్‌స్టార్, హిందీ యూఎఫ్‌వో వాళ్లు రిలీజ్, తమిళనాడు ఓన్ రిలీజ్‌లు నడుస్తున్నాయి. తెలుగులో మాత్రమే రు. 9 కోట్లకు అమ్మారట. ఓవర్సీస్ కూడా రు. 2 కోట్ల లోపే అంటున్నారు. తెలుగు, హిందీ శాటిలైట్ అమ్మలేదట. ఇప్పటి వరకు ఉన్న బిజినెస్ లెక్కలు చూస్తుంటే రు. 30 కోట్లకు కాస్త అటూ ఇటూగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ రు. 50 కోట్ల బిజినెస్ అంటూ ఫేక్ ప్రచారం నడుస్తోందంటున్నారు.
ఓవరాల్‌గా చూస్తే నిర్మాతే రు. 8 -10 కోట్ల డెఫిసెట్‌లో రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చిందట. మరి సినిమాకు అది కూడా సమంత స్టామినా, ఫేస్‌వాల్యూతో కలెక్షన్లు వస్తే నిర్మాత సేఫ్ అవుతాడు. లేకపోతే అంతే. అయితే రు. 50 కోట్ల బిజినెస్ అంటూ జరుగుతోన్న ఫేక్ ప్రచారం ఆపకపోతే రిలీజ్ తర్వాత తేడా కొడితే సమంతకే డ్యామేజ్ అయ్యేలా ఉంది.