Moviesఓ మై గాడ్: సదా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ పొట్టి...

ఓ మై గాడ్: సదా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ పొట్టి హీరోనేనా..?

దర్శకుడు తేజ పరిచయం చేసిన చాల మంది నటి నటులలో హీరోయిన్ సదా కూడా ఒకరు. నితిన్, సదా లను హీరో, హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ జయం అనే సినిమాలో 2002 లో సినిమా తీసాడు డైరెక్టర్ తేజ. ఈ సినిమా ఘనవిజయం సాధించడం తో నితిన్ మరియు సదా లకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం నితిన్ టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతుండగా, హీరోయిన్ సదా మాత్రం ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాల్లో నటించి ఇప్పుడు కెరీర్ లో డౌన్ ఫాల్ అయ్యింది. జయం సినిమా తర్వాత సదా చాల పెద్ద హీరోయిన్ అవుతుందని అందరు భావించిన కథల ఎంపికలో చేసిన తప్పుల కారణం గా అనుకున్నంతగా ఆమె కెరీర్ ముందుకు సాగలేదు.

సదా మరాఠి మాట్లాడే ముస్లిం తండ్రికి అలాగే హిందూ బ్రాహ్మిన్ తల్లికి మహారాష్ట్ర లో 1984 లో జన్మించింది. ఆమె చిన్నతనం అంత కూడా రత్నగిరి నగరంలో జరిగింది.ఆ తర్వాత వీరి కుటుంబం ముంబై కి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడే సదా లాంటి హీరోయిన్ తేజ కు లభించింది. ఇక జయం సినిమా విజయవంతం అవ్వగానే తమిళ్ దర్శకుడు శంకర్ విక్రమ్ హీరోగా సదా హీరోయిన్ గా అన్నియన్ అనే సినిమా తీసాడు. ఈ చిత్రం తెలుగు అపరిచితుడు పేరుతో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆతర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. సదా చివరగా నటించిన చిత్రం టార్చిలైట్. ఈ చిత్రం 2018 లో విడుదల అయ్యింది.

అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆమెకు కెరీర్ తొలినాళ్లలో లభించినట్టు క్రేజ్ అయితే రాలేదు. ఇక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లి తెరపై డీ జోడి నం 1 కి జడ్జి గా కూడా వ్యవహరించింది. ఆ తర్వాత పలు రియాలిటీ షోలతో కెరీర్ ని కొనసాగిస్తున్న సదా ఇప్పుడు మాత్రం కలిగానే వుంది. కెరీర్ ఎలా సాగుతున్న ఆమె వ్యక్తి గత జీవితం మాత్రం చాల క్లీన్ గా ఉంది. సదా హీరోలతో అఫైర్స్ సాగించే టైపు హీరోయిన్ కాకపోవడం వల్లనే ఆమెకు ఇండస్ట్రీ లో సరైన అవకాశాలు రాలేదు అని కూడా కొందరి అభిప్రాయం. జంతు ప్రేమికురాలైన సదా ఆనిమల్ రైట్స్ కోసం పోరాడుతుంది. ఆమె అనిమల్ సపోర్ట్ చేసే సంస్థలతో కలిసి పని చేస్తుంది.

ఇక 38 ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కెరీర్ లో బిజీ గా లేకపోయినా పెళ్లికి మాత్రం ఆమె ఎప్పుడు నో చెప్తూనే ఉంది. దానికి కారణం ఆమె కు సరైన వరుడు దొరక్కపోవడమే అని సదా చెప్తున్నా అందుకు ఇంకా వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. సదా సినిమాల్లో బిజీ గా ఉన్న టైం లో ఒక హీరోను ప్రేమించిందని అతడు ఆమెతో పెళ్ళికి నో చెప్పడం తో ఆమె ఇంకా పెళ్లి చేసుకోకూడదని నిరాయించుకున్నట్టు సమాచారం. ఆ హీరో ఎవ్వరో చెప్పకపోయినా ఇప్పటికి అతడినే సదా ప్రేమిస్తుందట. మరి ఈ దేవదాసి అవతారం చాలించి సదా ఎప్పుడు ఒక ఇంటికి ఇల్లాలు అవుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news