రాధిక 1980వ దశకంలో క్రేజీ హీరోయిన్. ఆమె తమిళ్ అమ్మాయి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో కృష్ణ – రాధిక, చిరు – రాధిక కాంబినేషన్‌కు ఎంతో క్రేజ్ ఉండేది. అసలు చిరు – రాధిక కాంబినేషన్లో అప్పట్లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు వారి బ్రేక్ డ్యాన్స్ చూసేందుకు ఊగిపోయేవారు. దర్శక, నిర్మాతలతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ చిరు – రాధిక కాంబినేషన్‌కు క్రేజ్‌తో పాటు ఎక్కువ బిజినెస్ జరిగేది.
చిరంజీవికి పెళ్లయ్యాక కూడా సురేఖ పక్కన ఉండగానే చిరు.. రాధికతో క్లోజ్‌గా ఉండడంతో పాటు బాగా ఆటపట్టించేవారట. అయితే అదే తరంలో హీరోగా వచ్చాడు బాలకృష్ణ. చిరు అప్పట్లో తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న వారందరితోనూ సినిమాలు చేసినా బాలయ్యతో మాత్రం సినిమాలు చేయలేదు. బాలకృష్ణతో రాధిక ఎందుకు ? సినిమాలు చేయలేదన్న ప్రశ్నకు అప్పట్లో చాలా సందేహాలే వచ్చేశాయి.
చిరంజీవి కావాలనే బాలయ్య – రాధిక కాంబినేషన్ కుదరకుండా చేశారని ఓ పుకారు అయితే ఉంది. బాలయ్య ఛాన్సులు వదులుకుంటేనే తన సినిమాల్లో ఛాన్సులు ఇస్తానని చిరు చెప్పడంతోనే రాధిక – బాలయ్య కాంబో కుదర్లేదని.. అందుకే రాధిక చిరు పక్కనే ఎక్కువు సినిమాలు చేసిందన్న టాక్ అయితే అప్పట్లో ఉంది.
అయితే ఈ పుకార్లపై సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ ఈమంది రామారావు తాజాగా క్లారిటీ ఇచ్చారు. చిరు వల్లే రాధిక, బాలయ్య పక్కన నటించలేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. బాలయ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు నుంచే చిరు – రాధిక కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయని.. అంతకుముందే ఆమె సీనియర్ హీరోల పక్కన కూడా నటించిందని చెప్పారు.
అయితే బాలయ్య సినిమాల్లోకి వచ్చి స్వింగ్‌లోకి వచ్చే టైంకు విజయశాంతి, సుహాసిని లాంటి హీరోయిన్లు వచ్చేశారని.. అందుకే బాలయ్య అప్పుడు ఫామ్‌లో ఉన్న హీరోయిన్లతోనే ఎక్కువ ట్రావెల్ అయ్యారని రామారావు చెప్పారు. ఇక శ్రీదేవితో బాలయ్య చేయకూడదన్న నిబంధన పెట్టుకున్నారు. అందుకే సుహాసిని, రజనీతో పాటు విజయశాంతితో ఎక్కువ సినిమాలు చేశారు.