ఇప్పుడు హీరోయిన్ సినిమా ఒప్పుకోవాలంటే ఒక్కోదానికి ఒక్కో రేటా..? అంటే అవును..ఈ విషయాన్ని మేకర్స్ బయట పెట్టలేకపోతున్నారు గానీ ఇదే నిజం అట. ఒకప్పుడు సినిమా షూటింగ్ అంటే క్యారవ్యాన్ అనేది లేదు. స్పెషల్‌గా ఒక్కొక్కరికి ఒక్కో గది లేదు. వీలును బట్టి నిర్మాత వద్ద ఉన్న బడ్జెట్‌ను బట్టి నటీ నటులు..టెక్నికల్ టీమ్మ్ అంతా సర్దుకుపోయేవారు. అప్పట్లో ప్రతీ ఒక్కరి దృష్ఠి మొత్తం సినిమా మీదే ఉండేది. రాను రాను దాదాపు అందరు నటులు కమర్షియల్‌గా తయారవుతున్నారు.
మరీ ముఖ్యంగా నటీమణులు అందులోనూ హీరోయిన్స్ నిర్మాతకి తెగ భారమవుతున్నారు. భారం అంటే అంతా ఇంతా కాదు..మోయలేనంత. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అంటే చాలా విషయాలలో మేకర్స్ కాంప్రమైజ్ అవుతున్నారు. సినిమాకి సైన్ చేయాలంటే హీరోయిన్ పెట్టే డిమాండ్స్ అన్నీటినీ ఒప్పుకొని తీరాల్సి వస్తోంది. ఒక్క సినిమా గనక భారీ కమర్షియల్ హిట్ సాధిస్తే ఆమె లక్కీ హీరోయిన్ అంటున్నారు.
వరుసగా నాలుగైదు సినిమాలు హిట్ మీద హిట్ కొడితే ఆ బ్యూటీ వెనకాలే దర్శకనిర్మాతలు హీరోలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కొందరు హీరోలు మాకు జోడీ ఆ హీరోయిన్ అయితే బావుంటుందని స్వయంగా నిర్మాతకి, దర్శకుడికి సిఫార్సు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో నిర్మాతలు కూడా వారినే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఫైనల్ చేసుకుంటున్నారు. ఎప్పుడు అయితే హీరోలు, దర్శక నిర్మాతలు తమ వెంట పడడం ప్రారంభించారో హీరోయిన్లు కూడా చెట్టెక్కేసి కూర్చొంటున్నారు.
అయితే, ఇటీవల కాలంలో సినిమా మొత్తానికి ఇంత రెమ్యునరేషన్ అనే లెక్కలు తగ్గుతున్నాయి.
హీరోయిన్‌గా నటించడానికి ఇంత రెమ్యునరేషన్..అందులో భారీగా స్కిన్ షో చేయాలంటే కొంత రెమ్యునరేషన్.. హీరోతో రొమాన్స్ చేస్తూ లిప్ కిస్సులు పెట్టాలంటే కొంత రెమ్యునరేషన్ ..అదనంగా డేటింగ్ చేయాల్సి వస్తే దాని లెక్క అవే అన్నట్టుగా హీరోయిన్ల గొంతెమ్మ కోర్కెలు ఉన్నాయి.
బయట అవుట్ డోర్ షూట్ కెళితే హోటల్..ఫుడ్..అసిస్టెంట్స్..ఇలా నిర్మాతకి తడిసి మోపెడవుతోంది. ఒంటిపై వెసుకునే బట్టల సైజును బట్టి అదనంగా రెమ్యునరేషన్ అందుకునే భామలున్నారు. వీటితో పాటు తమ ఫ్యామిలీ మెంబర్స్ ఖర్చులు, తమ అసిస్టెంట్ల ఖర్చులు కూడా నిర్మాతల అక్కౌంట్లలో వేసేస్తున్నారు.