Moviesసిగ్గుందా రా నీకు..? ఫస్ట్ టైం ఆది పై పూర్ణ సీరియస్..!!

సిగ్గుందా రా నీకు..? ఫస్ట్ టైం ఆది పై పూర్ణ సీరియస్..!!

రాను రాను తమ షో టీఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి బుల్లితెర సెలబ్రిటీలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయారు ఢీ నిర్వాహకులు . మనకు తెలిసిందే ఈటీవీలో గత కొన్ని సంవత్సరాలుగా ఢీ సీజన్స్ నడుస్తున్న సంగతి . కాగా ప్రజెంట్ ఢీ14 సీజన్ నడుస్తుంది . ఈ సీజన్లో హైపర్ ఆది తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ మెంటర్ గా అలరిస్తున్నాడు .

కాగా రీసెంట్ గా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డాన్సర్ శ్వేతాతో హైపర్ ఆది డాన్స్ చేశాడు . రామ్ చరణ్ నీతోనే డాన్స్ టు నైట్ అనే సాంగ్ కి శ్వేత, హైపర్ ఆది పర్ఫామె చేసారు. డ్యాన్స్ అయిపోయిన తర్వాత యాంకర్ ప్రదీప్.. ఇద్దరిలో విన్నర్ ఎవరో చెప్పాలి అంటూ జడ్జెస్ ని కోరారు . దీంతో మొదటిగా పూర్ణ.. అన్ డౌటెడ్లీ శ్వేతానే బాగా చేసింది అంటూ ఉన్నమాట చెప్పేసింది. దీంతో ఆదికి కోపం వచ్చి అసహనానికి గురయ్యాడు. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ విసిరేసి రూడ్ గా ప్రవర్తించాడు.

“ఫస్ట్ టైం మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు వేదికపై నుండి ఆమె మాట్లాడుతుండగానే దిగిపోయాడు . దీంతో కోప్పడిన పూర్ణా నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అంటూ ఫైర్ అయ్యింది.. దానికి అది నాకు డాన్స్ రాదు యాక్టింగ్ రాదు అంటూ గట్టిగా మాట్లాడాడు ..ఈ టైంలో నీకు సిగ్గు ఉంటే వెళ్ళు సిగ్గు లేదనుకుంటే ఇక్కడే ఉండు అంటూ త్రీవ వ్యాఖ్యలు చేసిన దానికి పూర్ణ కి ఆది కౌంటర్ ఇస్తూ నాకు సిగ్గులేదు ..సిగ్గు రాదు ఫ్యూచర్లో నా సిగ్గు అంటే ఏంటీ భవిష్యత్తులో మీరే చూస్తారు” అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు . ఆఫ్ కోర్స్ ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ జనాలకు తెలిసిన ఇలా బాధ్యత గల జడ్జి పొజిషన్లో ఉన్న పూర్ణ పై నోరు పారేసుకోవడం తప్పు అంటూ మండిపడుతున్నారు జనాలు. చూద్దాం ఇలాంటి యవ్వారాలు ఇంకెన్ని చూడాలో..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news