Moviesఆ విషయంలో కన్నీరు పెట్టుకున్న సురేఖ..ఫస్ట్ టైం ఫైర్ అయిన చిరంజీవి..?

ఆ విషయంలో కన్నీరు పెట్టుకున్న సురేఖ..ఫస్ట్ టైం ఫైర్ అయిన చిరంజీవి..?

సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి హీరో నుండి మెగాస్టార్ గా మారి చలనచిత్ర పరిశ్రమను ఏలే స్థాయికి ఎదిగాడు.. అంటే అది మామూలు విషయం కాదు . దానికి ఫ్యామిలీ సపోర్ట్ కచ్చితంగా ఉండాలి. కాగా ప్రతి ఈవెంట్ లో చిరంజీవి తన భార్య సురేఖ ను ఓ రేంజ్ లో పొగిడేస్తుంటారు. ” నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మొదట అల్లు రామలింగయ్య గారు కారణమైతే ..ఆ తర్వాత ఆమె కూతురు సురేఖ నా భార్య అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతూ ఉంటాను. నేను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న సరికి ఏనాడు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంటి బాధ్యతలను చక్కగా నెరవేర్చింది. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం సురేఖ అని నేను గర్వంగా చెప్పుకుంటాను “అంటూ పలు ఇంటర్వ్యూలలో స్టేజ్ పైన చెప్పుకొచ్చాడు.

కాగా అలాంటి సురేఖ ..చిరంజీవి మాటలకు బాధపడి కన్నీరు పెట్టుకుందట . ఈ విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సురేఖ – చిరంజీవి జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్లయి ఇన్నేళ్లు కలిసిన చాలా రొమాంటిక్గా పద్ధతిగా హ్యాపీగా ఉంటారు . అందరి జంటలు వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే విడాకులు అనేటివే ఉండవు అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తారు . పెళ్లయినతరువాత చిరంజీవి ఓ మూవీ షూటింగ్లో ఉన్నప్పుడు ఫ్రస్టేషన్ అయ్యి సురేఖ ను అరిచేసారట.

బయటకు వెళ్దాం అంటూ సురేఖతో టూర్ ప్లాన్ చేసి రెడీగా ఉన్నారట . అయితే సినిమా షూటింగ్ అనుకోకుండా వాయిదా పడి వాళ్ళ ప్రోగ్రాం టైం కి ఫిక్స్ అయిందట. ఈ క్రమంలోనే చిరంజీవి ఆ విషయాన్ని సురేఖా గారితో చెప్పడం మర్చిపోయాడు.. అంతా రెడీగా సిద్ధంగా పెట్టుకోనుంది సురేఖ.. అయినా టైం అయిపోతుంది చిరంజీవి ఇంటికి రాకపోవడం సురేఖ కాల్ చేసింది కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి.. ఏమైనా అయి ఉంటుందని భయపడి కంటిన్యూ గా కాల్ చేసింది. కానీ చిరంజీవికి అది విసుగు తెప్పించింది . ఫోన్ ఎత్తకపోతే ఆ మాత్రం తెలియదా బిజీగా ఉన్నానని అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారట. ఈ క్రమంలోనే సురేఖ ఆయన మాటలకు కన్నీరు పెట్టుకున్నారట . ఇక ఆ తర్వాత చిరంజీవి తనదైన స్టైల్ లో సురేఖ ని కూల్ చేసి సర్ధి చెప్పేసాడు అది వేరే మ్యాటర్ . భార్య భర్తలు అంటే ఇలానే ఉండాలి .. అడ్జస్ట్ అవ్వాలి అప్పుడే ఆ బంధం ముందుకు వెళ్తుంది అన్నదానికి ఇది మరొక నిదర్శనం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news