సుష్మా అద్భుతమైన నటి అంటే అందరూ..ఒక్కసారి ఎవరీ సుష్మా అని ఆలోచిస్తారు. అదే దేవయాని అంటే మాత్రం వెంటనే తెలుగులో సూపర్ హిట్ మూవీ సుస్వాగతం అందరికీ గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన దేయవాని మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకుంది. దేవయాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, బెంగాళీ భాషలలో కలిసి దాదాపు 75 సినిమాలలో హీరోయిన్గా నటించింది. వీటిలో చాలా సినిమాలు తనకి మంచి క్రేజ్ తెచ్చినవే కావడం విశేషం.
అయితే, తెలుగులో దేవయాని హీరోయిన్గా చేసింది చాలా తక్కువ సినిమాలు. ఎంత తక్కువ అంటే ఆమె నటించిన సినిమాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఎక్కువగా తమిళం, మలయాళ భాషలలోనే నటించింది. అయితే, దేవయాని తెలుగులో నటిస్తున్న సమయంలో సౌందర్య, రంభ, సిరాన్, రాశి లాంటి వారు కమర్షియల్ హీరోయిన్స్‌గా మంచి ఊపు మీదున్నారు. అంతేకాదు, వీరంతా గ్లామర్ పాత్రలతో రఫ్ఫాడిస్తున్నారు. కొన్ని సినిమాలలో సౌందర్య కూడా నాభి అందాలతో అరిపించింది.
ఇలా అంతమంది కమర్షియల్ హీరోయిన్స్ మధ్య దేవయాని చీరకట్టి డీసెంట్ పాత్రలతో నటించి ఆకట్టుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే అందాల ఆరబోతకి ఆమడ దూరంలో ఉండటం దేవయానికి పెద్ద మైనస్ అయింది. మన మేకర్స్‌కి కావాల్సింది వీలైనంత వరకు అందాలు ఆరబోసే హీరోయిన్స్. వారు సినిమా హిట్ చాలా దోహదపడుతుంటారు. అందుకే, ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ హిట్స్ అందుకునే హీరోయిన్స్ వెనకాలే క్యూ కడుతుంటారు. అందుకే, అప్పట్లో మేకర్స్ పెద్దగా దేవయానిని పట్టించుకోలేదు.
ఎంతో మంచి నటి, టాలెంట్ ఉన్నా కూడా ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు కేవలం గ్లామర్ షో చేయదన్న ఒక్క కారణంతోనే ఛాన్సులు ఇవ్వలేదు. ఇక దేవయాని టాలీవుడ్‌కి పరిచయమైన సమయానికి పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ కాదనే విషయం తెలిసిందే. ఇవన్నీ కలిసి దేవయానికి కెరీర్‌ని గట్టిగా దెబ్బకొట్టాయి. లేదంటే రంభ, రమ్యకృష్ణ, సౌందర్య లాంటి వారిగా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగేది.