Moviesద్యావుడా.. ఆ విషయంలో రంభ, సిమ్రాన్ ల మధ్య అంత గొడవ...

ద్యావుడా.. ఆ విషయంలో రంభ, సిమ్రాన్ ల మధ్య అంత గొడవ జరిగిందా..? మహ ముదుర్లు..!!

ఒక సినిమా షూటింగ్ లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. ముఖ్యంగా వారి డామినేషన్ భరించడం చాల కష్టం. ప్రాధాన్యత కోసం పడి చచ్చిపోతారు. తమ కన్నా పక్క హీరోయిన్ కి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చాలు ఇగో సమస్యలు మొదలవుతాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇగోలకు పెట్టింది పేరు. ఇక తమకు తక్కువ సీన్స్ ఉండి మరో హీరోయిన్ కి ఎక్కువ సీన్స్ ఉన్నాయంటే చాలు ఆ షూటింగ్ లొకేషన్ రచ్చ రచ్చ గా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలు చాల సినిమాల్లో జరిగినవే. నాటి నుంచి నేటి వరకు ప్రతి సినిమాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయ్.

 

అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన 90′ వ దశకం ఎండింగ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్నటువంటి సిమ్రాన్ మరియు రంభ మధ్య జరిగింది. ఈ ఇద్దరు హీరోయిన్స్ లో రంభ ఒక ఐదేళ్ల సీనియర్ హీరోయిన్ అని చెప్పాలి. ఆమె 1992 లో “ఆ ఒక్కటి అడక్కు” సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వగా, సిమ్రాన్ మాత్రం 1997 తమిళ్ మరియు తెలుగు సినిమాలతో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అయితే సిమ్రాన్ తొలి తమిళ సినిమా అయినా వి ఐ పి చిత్రంలో రంభ తో కలిసి నటించింది. ఇందులో ప్రభు దేవా, అబ్బాస్ మెయిన్ లీడ్ హీరోలుగా నటిస్తే సిమ్రాన్ మరియు రంభలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కగా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ చిత్రంలో సిమ్రాన్ మరియు రంభ ఒకరితో ఒకరు పోటీ పడి మరి నటించారు. సినిమా విజయంలో ఇద్దరు కీలకంగానే వ్యవహరించారు. కానీ లొకేషన్ లో మాత్రం చిన్న చిన్న విషయాలకే ఇద్దరికీ ఇగో ప్రొబ్లెమ్స్ వచ్చాయని అప్పటి మీడియా కోడై కూసింది. రంభ సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ సిమ్రాన్ కి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సీన్స్ ఉన్నాయని రంభ డైరెక్టర్ తో కూడా గొడవకు దిగినట్టు సమాచారం. దీంతో వీరి మధ్య గొడవలు జరిగాయనే వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ విషయం పై అప్పట్లో ఈ ఇద్దరు హీరోయిన్స్ నోరు మెదపలేదు. అలాగే మళ్లి ఎక్కడ కలిసి నటించకపోవడం బట్టి చూస్తే వచ్చిన రూమర్స్ నిజమే అని అంత భావించారు.

ఇక ఈ విషయం పై కొన్నేళ్ల తర్వాత హీరోయిన్ సిమ్రాన్ ఒక ఇంటర్వ్యూ లో తన అభిమాని ప్రశ్నించగా ఓపెన్ అయ్యింది. రంభ తో తనకు ఎలాంటి గొడవలు లేవని. మీడియా, మరియు ఇండస్ట్రీ లో కొందరు కావాలనే ఇలా గొడవలు సృష్టిస్తారని చెప్పడం విశేషం. ఇక మేము ఇద్దరం మంచి స్నేహితులమని కూడా సిమ్రాన్ తెలిపింది. రంభ ఎలా అనుకున్న తనకు మాత్రం ఆమె పై మంచి అభిప్రాయం ఉందని తెలిపింది. ఇక ఇండస్ట్రీ లో ఇలా ఇగో ఇస్సూస్ రావడం, మీడియా ముందు మాత్రం ఇలా మా మధ్య గొడవలు లేవని చెప్పడం అలవాటయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news