Moviesవిరాట్ వీడియో లీక్ చేసింది వాళ్లే.. ఎంత లాభమో తెలుసా..?

విరాట్ వీడియో లీక్ చేసింది వాళ్లే.. ఎంత లాభమో తెలుసా..?

సోషల్ మీడియా ద్వారా బాగుపడిన జనాలు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ.. నష్టపోయిన వాళ్ళు మాత్రం వేళల్లో ఉన్నారు. ఎస్ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రైవసీ కరువైందంటూ స్టార్ సెలబ్రిటీలు తలలు బాధుకుంటున్నారు. రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.

మనకు తెలిసిందే రీసెంట్గా విరాట్ కోహ్లీ పర్సనల్ రూమ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . ఆయన రూమ్ లో లేనప్పుడు ఆయన రూమ్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కొందరు ఆకతాయిలు . దీంతో సెకండ్స్ లోనే ఈ రూమ్ వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఆయన భార్య అనుష్కశర్మ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియోను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ..” కొందరు మితిమీరిన అభిమానం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ..ఇదేవిధంగా మీ బెడ్ రూమ్లో కెమెరా పెడితే మీకు ఎలా అనిపిస్తుంది “అని సూటిగా ప్రశ్నించింది .

అంతే కాదు కోహ్లీ స్పందిస్తూ..”దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకునే అభిమానులు అంటే నాకు ఎంతో ఇష్టం.. ఇలా దొంగతనంగా రూమ్ లోకి వచ్చి నా పర్సనల్ థింగ్స్ చూడాలనుకునే పిచ్చి అభిమానం నాకు వద్దనే వద్దు ” అంటూ ఫైర్ అయిపోయాడు కాగా అందుతున్న సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీ రూం వీడియీ తీసింది ఎవరో కాదు ఆయన స్టే చేస్తున్న హోటల్ మేనేజర్. ఎస్ వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం అంటూ బాలీవుడ్ లో న్యూస్ వైరల్ గా మారింది .

ఆయన స్టే చేస్తున్న హోటల్ మేనేజర్ కోహ్లీకి వీరాభిమాని . ఆయన ఏం ప్రొడక్ట్స్ వాడుతారు.. ఆయన రూమ్ ఎలా పెట్టుకుంటారు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఆయన ఈ వీడియోని తీసాడని ..కానీ సోషల్ మీడియాలో షేర్ చేసింది మాత్రం తాను కాదని ఎవరో నా మొబైల్ ని అన్లాక్ చేసి ఫార్వర్డ్ చేసుకున్నారని చెప్పకు వచ్చారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news