Movies' వాల్తేరు వీర‌య్య ' బిజినెస్ డ్యామేజ్ చేస్తోందెవ‌రు... చిరు టార్గెట్‌గా...

‘ వాల్తేరు వీర‌య్య ‘ బిజినెస్ డ్యామేజ్ చేస్తోందెవ‌రు… చిరు టార్గెట్‌గా ఏం జ‌రుగుతోంది…!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఖచ్చితంగా ఆయనకు బాస్ ఈజ్‌ బ్యాక్ సినిమా అని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి. కట్ చేస్తే సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఏపీ, నైజాంలో అన్ని ఏరియాల్లోనూ న‌ష్టాలు మిగిల్చింది. కీలకమైన నైజాం లాంటి ఏరియాలో అతి కష్టం మీద గాడ్ ఫాదర్ సినిమా రు. 12 కోట్లు రాబట్టింది. అల్లు అర్జున్ – ఎన్టీఆర్ – మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలు చాలా ఈజీగా నైజాంలో మాత్ర‌మే రు. 30 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్నాయి.

అలాంటిది చిరంజీవి సినిమాకు హిట్ టాక్ వచ్చిన అందులో సగం వసూళ్లు కూడా రాబట్ట లేకపోయింది. దీంతో సంక్రాంతి వస్తున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ పై భారీ ఎఫెక్ట్ పడనుంది. అస‌లు చిరును ఇండ‌స్ట్రీలో కొంద‌రు కావాల‌నే టార్గెట్ చేస్తున్నారా ? చిరు చుట్టూ ఏం జ‌రుగుతోంద‌న్న సందేహాలు ఇప్పుడు లెక్క‌కు మిక్కిలిగా వ‌స్తున్నాయి. అస‌లు చిరు, నాగ్ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో తెలిసిందే. అలాంటిది గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.

పైగా అదే రోజు బెల్లంకొండ స్వాతిముత్యం వ‌చ్చింది. చిరుది రీమేక్ మూవీ. సోలోగా వ‌చ్చి ఉంటే సినిమాకు వ‌చ్చిన టాక్‌కు ఇంకా బెట‌ర్ వ‌సూళ్లు వ‌చ్చి ఉండేవి. కానీ నాగ్ కూడా ఈ విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌కుండా చిరుతో పోటీకే సై అన్నాడు. గాడ్ ఫాద‌ర్ వ‌సూళ్లు ఘోరంగా ప‌డిపోవ‌డానికి ఇదో కార‌ణం అయితే… సినిమా రీమేక్ కావ‌డం మ‌రో కార‌ణం. ఈ సినిమా ఒరిజిన‌ల్ లూసీఫ‌ర్ ఇప్ప‌టికే చాలా మంది చూసేశారు. ఇక అంతో ఇంతో వ‌సూళ్లు ఉన్నాయ‌నుకుంటోన్న టైంలో వ‌చ్చిన కాంతారా దెబ్బ‌తో గాడ్ ఫాద‌ర్ మ‌రీ వీక్ అయిపోయింది.

కాంతారాను ఏపీ, తెలంగాణ‌లో రిలీజ్ చేసింది అల్లు అర‌విందే. ఎలాగూ డ‌బ్బింగ్ సినిమాయే. అర‌వింద్ మ‌రో వారం గాడ్ ఫాద‌ర్‌కు స్పేస్ ఇచ్చి ఉంటే సినిమా మ‌రీ ఇంత దారుణంగా న‌ష్ట‌పోద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏపీలో విశాఖ‌లో గాడ్ ఫాద‌ర్‌కు వ‌చ్చిన వ‌సూళ్లు రు. 6 కోట్లే. ఈ సినిమా ఏపీ మొత్తం మీద రు. 25 కోట్ల రేషియోలో వ‌సూళ్లు రాబ‌ట్టింది.

అయితే ఇప్పుడు ఇదే ఏరియాల‌కు వాల్తేరు వీర‌య్య‌కు రు. 45 కోట్లు అంటున్నారు. అయితే ఎవ్వ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి. పైగా సంక్రాంతికి ఆదిపురుష్‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి మ‌ధ్య ట‌ఫ్ కాంపిటేష‌న్లో వీర‌య్య వ‌స్తోంది. అంటే రు. 30 కోట్లు.. మ‌హా అయితే రు. 35 కోట్ల‌కు మించి ఈ సినిమాను ఏపీలో కొనే అవ‌కాశాలు లేవంటున్నారు. ఏదేమైనా గాడ్ ఫాద‌ర్ హిట్ అయినా అనేక ప్రాబ్ల‌మ్స్ మ‌ధ్య అనుకున్న వ‌సూళ్లు రాబ‌ట్ట‌క‌పోవ‌డం ఇప్పుడు వాల్తేరు వీర‌య్య బిజినెస్‌కు పెద్ద దెబ్బ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news