Moviesబాల‌య్య వీర‌సింహారెడ్డికి పోటీగా వాల్తేరు వీర‌య్య‌లో అలా చేస్తున్నారా...!

బాల‌య్య వీర‌సింహారెడ్డికి పోటీగా వాల్తేరు వీర‌య్య‌లో అలా చేస్తున్నారా…!

టాలీవుడ్‌లో వ‌చ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండ‌ద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ ఐదేళ్ల గ్యాప్ త‌ర్వాత త‌మ సినిమాల‌తో పోటీ ప‌డుతున్నారు. మ‌ధ్య‌లో దిల్ రాజు నిర్మాత‌గా కోలీవుడ్ క్రేజీ హీరో విజ‌య్ న‌టిస్తోన్న వార‌సుడు సినిమా కూడా వస్తోంది. ఇక ఒక‌టి రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నా కూడా మెయిన్‌గా చిరు, బాల‌య్య సినిమాల మ‌ధ్యే పోటీ ఉండ‌నుంది.

అయితే ఇక్క‌డే చాలా చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఈ రెండు సినిమాల‌ను మైత్రీ మూవీస్ వాళ్లే నిర్మిస్తున్నారు. ఏ సినిమాకు అయినా కాస్త ఎక్కువ ప్ర‌మోష‌న్ జ‌రిగినా, బ‌డ్జెట్ పెట్టినా మ‌రో సినిమా హీరో ఖ‌చ్చితంగా ఫీల్ అయ్యే ప్ర‌మాదం ఉంది. అయితే వీర‌సింహారెడ్డి సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్ ఇస్తున్నారు. థ‌మ‌న్ అల వైకుంఠ‌పురంలో సినిమా నుంచి ప్ర‌మోష‌న్ కోసం క‌వ‌ర్ సాంగ్‌లు ఇస్తున్నాడు. ఈ క‌వ‌ర్‌సాంగ్ వ‌ల్లే అల వైకుంఠ‌పురం సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బ‌జ్ వ‌చ్చింది.

ఈ క‌వ‌ర్ సాంగ్ వ‌ల్ల మంచి ప్ర‌మోష‌న్‌తో పాటు ప్రి రిలీజ్ బిజినెస్ ఎక్కువ జ‌ర‌గ‌డం, ఓపెనింగ్స్ ఎక్కువ రావ‌డం ఇలా చాలా ప్ల‌స్ అవుతోంది. స‌ర్కారువారి పాట‌కు కూడా ఇది ఎంతోకొంత ప్ల‌స్ అయ్యింది. ఇక ఇప్పుడు బాల‌య్య వీర‌సింహారెడ్డి సినిమాకు కూడా థ‌మ‌న్ జై బాల‌య్యా అంటూ ఓ అదిరిపోయే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ రెడీ చేస్తున్నారు. ఈ సాంగ్‌కు భారీగానే ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌.

ఈ సాంగ్ అయితే అదిరిపోయే రేంజ్‌లో వ‌చ్చింద‌ని సినిమా యూనిట్ వ‌ర్గాల నుంచి తెలిసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాతో పాటు చిరు వాల్తేరు వీర‌య్య‌కు కూడా మైత్రీ వాళ్లే నిర్మాత‌లు కావ‌డంతో ఆ సినిమాకు కూడా ఓ క‌వ‌ర్ ప్ర‌మోష‌న్ సాంగ్‌ను దేవిశ్రీతో స్టార్ట్ చేయించే ప్లాన్ చేస్తున్నారు. దేవీ కూడా ఇప్పుడు వాల్తేరు వీర‌య్య‌కు ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ మొద‌లు పెడితే ఇప్ప‌టి నుంచే ఈ రెండు సినిమాల వార్ మొద‌లైన‌ట్టే అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news