నందమూరి నరసింహ బాలకృష్ణ అఖండ సినిమా నుంచి ఫుల్ జోష్తో దూసుకుపోతున్నాడు. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ఏ ముహూర్తాన అఖండ రిలీజ్ అయిందో కానీ బాలయ్యకు ఎప్పుడూ లేని అఖండఖ్యాతి తెచ్చిపెట్టింది. అఖండ సినిమా దెబ్బతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అటు వెండితెరను దున్నేస్తున్నాడు. ఇటు బుల్లితెరపై అన్స్టాపబుల్ లాంటి క్రేజీ టాక్ షోను వంటి చేత్తో తిరుగులేని విధంగా బ్లాక్ బస్టర్ చేసి పడేశాడు. ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 2 కూడా గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతోంది.
ప్రస్తుతం బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఆంధ్ర, తెలంగాణతో పాటు అటు ఓవర్సీస్ లోను అదిరిపోయే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో తర్కెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి కానుకగా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వేరయ్య సినిమాకు పోటీగా రెడీ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే డిసెంబర్ నుంచి బాలయ్య అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కించనున్నాడు. బాలయ్య కెరీర్లో 108వ సినిమాగా అనిల్ రావిపూడి సినిమా వస్తోంది.
సైన్ స్క్రీన్ బ్యానర్ పై గారపాటి సాహు, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రామారావు గారు అన్న టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. అనిల్ రావిపూడి సినిమా ముగిసిన వెంటనే కూడా బాలయ్య వరుసగా క్రేజీ డైరెక్టర్లను తన లైన్లో సెట్ చేసుకున్నాడు. పూరీ జగన్నాథ్ – బోయపాటి శ్రీను బాలయ్యతో సినిమా కోసం రెడీగా ఉన్నారు. అలాగే సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు మరో కొత్త దర్శకుడు కూడా బాలయ్య లైన్లోకి వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో ?కాదు గబ్బర్ సింగ్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఒక్కసారిగా కెరీర్ టర్న్ చేశాడు. హరీష్ శంకర్ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్యా సినిమా కూడా తీశాడు. సాధారణంగా హరీష్ శంకర్ సినిమాలు అంటే యూత్ కు బాగా నచ్చుతాయి. మరి ఇప్పుడు హరీష్ శంకర్ మాస్ – యాక్షన్ హీరో బాలయ్యతో సినిమా అనగానే ఒక్కసారిగా క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఏదేమైనా ఈ ప్రాజెక్టు సెట్ అయితే టాలీవుడ్లో కచ్చితంగా సంచలనాత్మక ప్రాజెక్టు అవుతుంది అనటంలో సందేహం లేదు.