Movies"3 కోట్లకి 60 కోట్లు"...అల్లు అరవింద్ మరో సంచలన నిర్ణయం..!!

“3 కోట్లకి 60 కోట్లు”…అల్లు అరవింద్ మరో సంచలన నిర్ణయం..!!

అల్లు అరవింద్ నక్కతోక తొక్కాడ అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. లేకపోతే రెండు కోట్లు పెట్టి డబ్బింగ్ రైట్స్ స్వాధీనం చేసుకున్న అల్లు అరవింద్ ఏకంగా 60 కోట్ల లాభాలను వెనకేసుకోవడం అంటే మాటలా. వామ్మో.. ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డు అనే చెప్పాలి . అల్లు అరవింద్ ప్రజెంట్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా సినీ ఇండస్ట్రీలో రాజ్యం ఏలుతున్నాడు . మరీ ముఖ్యంగా డైరెక్ట్ సినిమాలు నిర్మించి బొక్క బోర్లా పడుతున్న అల్లు అరవింద్ .. డబ్ చేసి సినిమాలను నిర్మిస్తూ కోట్లలల్లో లాభాలు అందుకుంటున్నాడు. రీసెంట్గా కోలీవుడ్ డైరెక్టర్ హీరోగా నటించిన సినిమా కాంతారా.

రిషబ్ శెట్టి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. పూర్తిగా నాచురాలిటీ కోణంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది .కేజీఎఫ్ లెక్కలను మార్చేసింది. కాగా రీసెంట్గా టాలీవుడ్ బిగ్గెస్ట్ రికార్డును బ్రేక్ చేసింది కాంతారా. అల్లు అర్జున్ పుష్ప రికార్డును తుక్కుతుక్కుగా చితకొట్టేసింది కాంతారా సినిమా . అయితే మరో సినిమాను తెలుగులో డబ్ చేయబోతున్నాడు అల్లు అరవింద్ .

మరో ప్రాజెక్ట్ ని పట్టేసాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ , అందాల బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తున్న “బేరియా” సినిమాను ఆయన తెలుగులో తోడేలు అనే పేరుతో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు . హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది . ఈ సినిమా కూడా కాంతారా లాగే అల్లు అరవింద్ కి బిగ్గెస్ట్ లాభాలు తీసుకొస్తుందని ..సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచెసాయి. ఇలా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ లాభాలు తీసుకుంటున్న ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ రికార్డు నెలకొల్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news