రాధిక..తమిళ, తెలుగు భాషలలో స్టార్ హీరోలతో నటించి క్రేజీ హీరోయిన్‌గా అసాధారణమైన పాపులారిటీ సంపాదించున్నారు. హీరోయిన్‌గా మాత్రమే కాదు, కథ నచ్చితే కీలక పాత్రల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు. 1980 నుంచి 1990 మధ్య రాధిక నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో రాధిక నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్.
హీరోయిన్‌గా నటించిన రాధిక శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటిగానే కొనసాగుతూ ఉన్నారు. శరత్‌కుమార్‌తో రాధికది మూడో పెళ్లి. అంతకు ముందే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి పెటాకులు అయ్యాయి. శరత్ కుమార్‌తో పెళ్లి… సెకండ్ ఇన్సింగ్స్ తర్వాత రాధిక కెరీర్‌కి బ్రేక్ పడింది లేదు. సినిమాలలో నటిస్తూనే, రాడాన్ మీడియా పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి సన్ నెట్‌వర్క్‌లో డైలీ సీరియల్స్‌ను చేస్తున్నారు.
అక్కడ కూడా అద్బుతమైన పాత్రలను పోషొస్తున్నారు. జీన్స్, ప్రేమకథ లాంటి సినిమాలలో రాధిక పోషించిన పాత్రలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ సినిమాలు చూసిన వారికే తెలుస్తుంది. అయితే, రాధిక ఇంత కాలం ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా కొనసాగడానికి కారణం హీరోయిన్‌గా నటించిన సమయంలో తన కోసం అద్భుతమైన పాత్రలను ఇచ్చిన దర్శకులే. రాధిక ఏ దర్శకుడితో సినిమా చేసిన కూడా వారితో మంచి బాండింగ్ ఏర్పరచుకుంది.
అందరికంటే ఎక్కువ బాండింగ్ సీనియర్ దర్శకులు ఏ కోదండరామిరెడ్డితో ఎక్కువ బాండింగ్ ఉంది. ఎంతగా అంటే ఆయనని ఏకంగా బావ అని పిలిచేంత. అంత బాండింగ్ ఉంది కాబట్టే ఆయన పర్మీషన్ ప్రతీ సినిమాకి తప్పకుండా తీసుకునేవారట. మెగాస్టార్ చిరంజీవి, ఏ కోదండ రామిరెడ్డి కాంబోలో 20 సినిమాలకి పైగా వచ్చాయి. వాటిలో 18 సినిమాలు బ్లాక్ బస్టర్.
అప్పట్లో కోదండ రామిరెడ్డి ఎక్కువగా తన సినిమాలలో రాధికనే తీసుకునేవారట. అందుకే రాధిక కి కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వస్తే ముందు కోదండరామి రెడ్డితో చర్చించి అప్పుడు గాన్నీ, ఆ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేసేవారు కాదట. ఇదీ మేకర్స్ పట్ల ఆమెకున్న అభిమానం, పనిపట్ల ఉన్న కమిట్‌మెంట్.