మెగాస్టార్ చిరంజీవి దసరా కానుకగా ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే రోజు మరో సీనియర్ హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ‘దిఘోస్ట్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో పాటు బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు నటిస్తున్న ‘స్వాతిముత్యం’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. మూడు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులో ఇద్దరు సీనియర్ హీరోలు ఖచ్చితంగా దసరా సెలవులు క్యాష్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు.
అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూడు సినిమాలు మధ్య ఇంట్రెస్టింగ్ పోరు ఉండేలా ఉంది. చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొందరు కావాలని టార్గెట్ చేస్తూ థియేటర్లు ఇవ్వడం లేదని మెగా అభిమానులు వాపోతున్నారు. మూడు సినిమాలు ఒకేరోజు రావడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. ముఖ్యంగా నైజాంలో ‘గాడ్ ఫాదర్’ కు సరైన థియేటర్లో దక్కడం లేదని తెలుస్తోంది.
నాగార్జున ఘోస్ట్ సినిమా నిర్మాత ఆసియన్ సునీల్. నైజాంలో ఆసియన్ వాళ్లకు ఎక్కువ థియేటర్లు ఉండడంతో తమ థియేటర్లు అన్ని నాగార్జున సినిమాకు ఇచ్చేశారు. ఇక స్వాతిముత్యం చిన్న సినిమా అయినా కూడా నైజాంలో మంచి థియేటర్లు పడుతున్నాయి, దీనికి కారణం ఈ సినిమా నిర్మాత నాగ వంశీ పెద్ద ప్రొడ్యూసర్. ‘స్వాతిముత్యం’ కు దిల్ రాజు సపోర్టు ఉండటంతో దిల్ రాజు థియేటర్లు అన్ని ఆ సినిమాకే వెళుతున్నాయి.
నైజాంలో థియేటర్‌ల పరంగా ఆసియన్ సునీల్, దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరి థియేటర్లు స్వాతిముత్యం-ఘోస్ట్ కు వెళ్లిపోవడంతో ఇప్పుడు చిరంజీవి సినిమాకు సరైన థియేటర్లు దొరకటం లేదు. దీంతో చిరంజీవి అభిమానులు తమ హీరోకు కూడా మంచి థియేటర్లు ఇవ్వాలని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మీద ఒత్తిడి మొదలు పెట్టేశారు. ఎందుకో గాని గాడ్ ఫాదర్ థియేటర్ల విషయంలో.. ప్రమోషన్ల విషయంలో మేకర్లు పెద్దగా పట్టించుకున్నట్టు లేరు. ఆచార్య సినిమా రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ లేదు.
ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. కావాలనే తమ అభిమాన హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు కొందరు టార్గెట్ చేస్తున్నారంటూ మెగా అభిమానులు వాపోతున్నారు.
ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నైజాంలో దిల్ రాజు కావాలని తమ సినిమాను టార్గెట్ చేశారు అంటూ ఆచార్య పంపిణీదారుడు వరంగల్ శ్రీను ఆరోపణలు చేశారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ కు మళ్ళీ ఇబ్బందులు తప్పడం లేదు. ఏదేమైనా చిరు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడే ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది.