Movies"నీ చుట్టూ ఉన్నవారే ముంచేస్తున్నారు నయన్"..నా భార్య నాశనం కోరుకున్నది...

“నీ చుట్టూ ఉన్నవారే ముంచేస్తున్నారు నయన్”..నా భార్య నాశనం కోరుకున్నది వాళ్లే..విగ్నేశ్ సంచలన పోస్ట్..!?

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ లకి కవల పిల్లలకు అమ్మానాన్నలు అవడం. మనకు తెలిసిందే వాళ్ళ జీవితంలోనే స్పెషల్ డే అయిన అక్టోబర్ 9 న విగ్నేష్ శివన్ తల్లిదండ్రులు అయ్యాము అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నయనతార విగ్నేశ్ లకు పెళ్లయి కేవలం నాలుగు నెలలు పూర్తయింది . ఇంత త్వరగా పిల్లలను కనడం ఏంటా అంటూ జనాలు ఆశ్చర్యపోయారు.

మరోపక్క ఇది సరోగసి ప్రాసెస్ ద్వారా జరిగింది అని పక్క సమాచారంతో కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే కొందరేమో నయనతార విగ్నేశ్ ఈ పిలలని దత్తత తీసుకున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఇప్పటివరకు నయన్ కానీ విగ్నేష్ కానీ వాళ్ల కవల పిల్లలకు ఎలా తల్లిదండ్రులు అయ్యారో అది సరోగసి ద్వారానా లేక దత్తత ద్వారా అనే విషయం అఫీషియల్ గా ప్రకటించలేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యత గల స్టార్ సెలబ్రిటీస్ అయిన మీరు సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డలని కనడం తప్పని సరోగసి ఇండియాలో బ్యాన్ చేశారని .దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు కోర్టుకి అందజేయాలని నయన్ విగ్నేష్ జంటలకు నోటీసులు పంపించింది.

దీంతో ఇప్పుడు నయనతార విగ్నేష్ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నట్లైంది. తమిళనాడు పోలీస్ స్టేషన్ లో నయనతార విగ్నేశ్ శివన్ ల పై కేసు కూడా ఫైలైనట్టు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో విగ్నేష్ శివన్ సంచలన వ్యాఖ్యలు చేసుకోవచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ నయనతారకు సపోర్టుగా నిలిచారు. ఇవన్నీ చూస్తుంటే సరోగసి ప్రాసెస్ పై విగ్నేష్ శివన్ పరోక్ష కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది .

ఆయన పోస్ట్ పెడుతూ..” నీ చుట్టూ ఉన్నవారిని గమనించు.. నీకు తోడుగా ఉంటూ నిక్షేమం కోరుకునే వారే నిజమైన నీవాళ్లు ..ఇది ఎప్పటికీ వాస్తవం” అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి “ఓపికగా ఉండు అన్ని సరైన సమయంలో జరుగుతాయి ..జరిగేది అంత మన మంచికే” అంటూ మరో పోస్ట్ పెట్టాడు . దీంతో విగ్నేష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని బట్టి నయన్ నాశనం కోరుకునేది ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వాళ్లే అంటూ విగ్నేశ్ చెప్పకనే చెప్పేసాడు. ఏది ఏమైనా సరే నయన్ విగ్నేశ్ జంట ఇలా చిక్కుల్లో ఇరుక్కోవడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news