Moviesఎవ్వరు ఊహించని షాక్ ఇచ్చిన త్రివిక్రమ్ .. కొంప ముంచేసావుగా రా...

ఎవ్వరు ఊహించని షాక్ ఇచ్చిన త్రివిక్రమ్ .. కొంప ముంచేసావుగా రా సామీ..!?

ఏంటో ఈ త్రివిక్రమ్ తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు కానీ.. ఇప్పుడు ఆయన చేసిన ఓ బిగ్ మిస్టేక్ కారణంగా మహేష్ అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. ఏంట్రా బాబు మా అన్న విషయంలో ఇలా చేశావు అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ త్రివిక్రమ్ అంతలా మహేష్ బాబుని మహేష్ బాబు ఫ్యాన్స్ ని హార్ట్ చేసే విధంగా ఏం చేశారో తెలుసా? ..రండి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారి వారి పాట” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రజెంట్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తన కెరియర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ జరుగుతుంది . ఈ మధ్యనే మహేష్ బాబు అమ్మగారు చనిపోవడం కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశారు . అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. కాగా అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే దీవాళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ని విడుదల చేయాల్సింది.

కానీ మహేష్ బాబు అమ్మగారు చనిపోయిన బాధలో ఉన్న కారణంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు . కాగా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు “అర్జునుడు” అనే టైటిల్ను ఫిక్స్ చేసాడట. త్రివిక్రమ్ శ్రీనివాసరావు .దీంతో ఒక్కసారిగా మహేష్ బాబు అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. నిజానికి మహేష్ బాబు కెరియర్ లో అర్జున్ సినిమా ఎంత డిజాస్టర్ గా మిగిలిందో తెలిసిందే. మళ్లీ అదే సెంటిమెంట్ తో అర్జున్ అనే టైటిల్ పదం వచ్చేలా ఇలా సినిమా పేరు పెట్టడం అభిమానులకి నచ్చలేదు. అంతేకాదు అర్జున్ సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా అక్క సెంటిమెంట్ తో రన్ అవుతుంది మూవీ అన్నట్లు తెలుస్తుంది . ఒకవేళ నిజంగా అది నిజమే అయితే మహేష్ బాబు కెరియర్లో 28 మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా సరే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొంచెం ఆలోచించి టైటిల్ పెడితే బాగుండేది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news