MoviesTL రివ్యూ: స్వాతిముత్యం... నీట్‌గా క్యూట్ హిట్‌

TL రివ్యూ: స్వాతిముత్యం… నీట్‌గా క్యూట్ హిట్‌

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా స్వాతిముత్యం. సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అభిరుచి ఉన్న నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమా ఇద్ద‌రు స్టార్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున న‌టించిన గాడ్ ఫాద‌ర్‌, ది ఘోస్ట్ సినిమాల‌కు పోటీగా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స్వాతిముత్యంతో గ‌ణేష్ డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టాడా అన్న‌ది TL స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
బాల (బెల్లం కొండ గణేష్) జూనియ‌ర్ ఇంజ‌నీర్‌గా ఎల‌క్ట్రిక‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌ని చేస్తూ ఉంటాడు. చాలా మంచోడు. తండ్రి వెంక‌ట్రావ్ ( రావూ ర‌మేష్‌) పెళ్లి సంబంధాలు చూస్తున్నా అవి మ్యాచ్ కావు. అయితే పెళ్లి చూపుల్లో భాగ్య‌ల‌క్ష్మి ( వ‌ర్ష బొల్ల‌మ్మ‌) ని చూసి తొలి చూపులోనే ల‌వ్‌లో ప‌డిపోతాడు. అటు భాగ్య‌ల‌క్ష్మికి కూడా బాలా న‌చ్చేస్తాడు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తాడు. స‌రిగ్గా పెళ్లి రోజే బాలా జీవితంలో ఊహించ‌ని మ‌లుపు జ‌రుగుతుంది. శైల‌జ ( దివ్య శ్రీపాద‌) 9 నెల‌ల బిడ్డ‌తో వ‌చ్చి బాలాయే ఆ బిడ్డ‌కు తండ్రి అని అంద‌రి ముందు చెపుతుంది. బాలా కూడా ఆ బిడ్డ‌కు తండ్రి తానే అని ఒప్పుకుంటాడు. అస‌లు శైల‌జ ఎవ‌రు ? ఒక బిడ్డ‌కు తండ్రి అయిన బాలా మ‌ళ్లీ భాగ్య‌ల‌క్ష్మిని ఎందుకు ? ప్రేమిస్తాడు.. మంచోడు అనుకున్న బాలా ? ఇలా ఎందుకు ? చేశాడు ? ఆ బాబు ఎవ‌రు ? చివ‌ర‌కు బాలా క‌థ ఎలా మ‌లుపులు తిరిగింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరి.

విశ్లేష‌ణ :
చాలా మంది పాత‌క‌థ‌నే కొత్త స్క్రీన్ ప్లే, ప్రెష్ సీన్లు అల్లుకుని ఎంగేజ్ చేస్తూ చెపుతున్నారు. స్వాతిముత్యం ద‌ర్శ‌కుడు కె. ల‌క్ష్మ‌ణ్ కృష్ణ కూడా ఈ సినిమా కోసం అదే ఫార్మాట్‌లో వెళ్లాడు. పాత పాయింట్‌నే తీసుకుని చాలా కొత్త‌గా చెప్పాడు. గ‌తంలో ఇదే త‌ర‌హా క‌థ‌లు చాలానే వ‌చ్చాయి. బాలీవుడ్ హిట్ మూవీ విక్కీడోన‌ర్‌ను తెలుగులో సుమంత్ హీరోగా తీసినా ఇక్క‌డ స‌క్సెస్ కాలేదు. అయితే ల‌క్ష్మ‌ణ్ అదే పాయింట్ ఇక్క‌డా తీసుకుని ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా స్వాతిముత్యంను ప్రజెంట్ చేశాడు. సినిమా స్టార్టింగ్‌లో పెళ్లి చూపుల‌కు వెళ్లి పెళ్లి కూతురు చెల్లిని క‌లిసి రావ‌డం, బాలా ఆఫీస్‌లో జ‌రిగే సీన్లు నుంచి పుట్టిన కామెడీ ప్రెష్‌గా ఉంటాయి.

హీరో, హీరోయిన్ల ప్రేమ స‌న్నివేశాలు ప్రెష్‌గా బాగున్నాయి. ఇంట‌ర్వెల్‌కు ముందే ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ‌లోకి వ‌స్తాడు. హీరో ఎప్పుడు అయితే త‌న త‌ప్పు జ‌రిగింద‌ని ఒప్పుకున్నాడో సెకండాఫ్‌లో చెప్పేందుకు పెద్ద‌గా క‌థ లేదు. హీరో చెప్పేది వినేందుకు కూడా ఎవ్వ‌రూ సిద్ధంగా లేరు. ఆ టైంలో సెకండాఫ్ న‌డిపించ‌డం క‌త్తిమీద సామే. అక్క‌డే ద‌ర్శ‌కుడు త‌న తెలివి తేట‌లు వాడుకున్న తీరు బాగుంది. ఆ త‌ర్వాత సుబ్బరాజు పెళ్లి చూపులు, గోపరాజు పెద్దరికం, రావురామేష్ మ్యానరిజంపై ద‌ర్శ‌కుడు రాసుకున్న సీన్లు సూప‌ర్బ్‌. సినిమా ఆద్యంతం ఫ్యామిలీ ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా ఉంది.

గ‌ణేష్ స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది. తొలి సినిమాలో డీసెంట్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక భాగ్యలక్ష్మి పాత్ర‌లో నటించిన వర్ష బొల్లమ్మ తన నటనతో బాగా ఆట్టుకుంటుంది. ఆమె పాత్ర కూడా కామెడీగా సాగుతూ బాగానే ఎంటర్ టైన్ చేసింది. మహతి స్వరసాగర్ మ్యూజిక్ డీసెంట్. కెమేరా వ‌ర్క్ నీట్‌గా ప్ర‌తి ప్రేమ్ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. నిర్మాణ విలువ‌ల్లో రాజీ లేదు.

ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్లు మెప్పించ‌లేక‌పోవ‌డం.. హీరో కుటుంబం ఒక్కోసారి సిల్లీగా బిహేవ్ చేసిన‌ట్టు ఉండ‌డం లాంటి చిన్న చిన్న మైన‌స్‌లు మిన‌హా చెప్పుకోద‌గ్గ‌వి లేవు. స్వాతిముత్యం అనే క్లాసిక్ టైటిల్‌కు ఎక్క‌డా మ‌చ్చ లేకుండా నీట్‌గా తెర‌కెక్కించిన సినిమా ఇది.

ఫైన‌ల్‌గా…
స్వాతిముత్యం టైటిల్‌తో వ‌చ్చిన ఈ కామెడీ సినిమా మంచి ఫీల్‌తో బాగా ఆక‌ట్టుకుంది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీతో పాటు ప్రెష్ ఫీల్ సీన్లు సినిమాలో హైలెట్స్‌. ఈ ద‌స‌రాకు ఎంచ‌క్కా ఫ్యామిలీతో స‌హా ఎంజాయ్ చేసే సినిమా.

ఫైన‌ల్ పంచ్ : కంటెంటే హీరోగా హిట్ కొట్టిన స్వాతిముత్యం

స్వాతిముత్యం రేటింగ్ : 2.75 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news