MoviesTL రివ్యూ: ది ఘోస్ట్‌... యాక్ష‌న్‌తో హిట్ కొట్టిన నాగ్‌

TL రివ్యూ: ది ఘోస్ట్‌… యాక్ష‌న్‌తో హిట్ కొట్టిన నాగ్‌

టైటిల్‌: ది ఘోస్ట్‌
స‌మ‌ర్ప‌ణ‌: సోనాలి నారంగ్‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌, నార్త్‌స్టార్ ఎంట‌ర్టైన్‌మెంట్‌
న‌టీన‌టులు: నాగార్జున‌, సోనాల్ చౌహాన్‌, గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగర్ త‌దిత‌రులు
ఆర్ట్: బ్ర‌హ్మ క‌డ‌లి
సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్‌. జి
మ్యూజిక్‌: భ‌ర‌త్‌, సౌర‌భ్‌, మార్క్ రాబిన్‌
ఎడిట‌ర్‌: ధ‌ర్మేంద్ర కాక‌ర్ల‌
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యుస‌ర్‌:
నిర్మాత‌లు: సునీల్ నారంగ్‌, పుష్క‌ర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మ‌రార్‌
ఎడిష‌న‌ల్ స్క్రీన్ ప్లే: అబ్బూరి ర‌వి
ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ సత్తారు
పీఆర్వో: వంశీ – శేఖ‌ర్‌
రిలీజ్ డేట్‌: 05 అక్టోబ‌ర్‌, 2022
సెన్సార్ రిపోర్ట్ : U / A
ర‌న్ టైం: 135 నిమిషాలు
బ్రేక్ ఈవెన్ టార్గెట్ : రు. 21 కోట్లు

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి త‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టాడు. నాగ్‌కు గ‌త కొన్నేళ్ల‌లో సోలో హిట్లు మాత్రం ద‌క్క‌డం లేదు. మ‌న్మథుడు 2 డిజాస్ట‌ర్‌. వైల్డ్‌డాగ్‌, ఆఫీస‌ర్ లాంటి సినిమాలు ప‌గ‌లు చూస్తే రాత్రి క‌ల‌లోకి వ‌చ్చేంత ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఇలాంటి టైంలో ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో ది ఘోస్ట్ సినిమా చేశాడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ కాస్త ప్రామీసింగ్‌గా అనిపించాయి. అయినా కూడా చాలా త‌క్కువుగా రు. 21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ మాత్ర‌మే జ‌రిగింది. చాలా త‌క్కువ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన నాగ్ ఈ సినిమాతో అయినా సోలోగా హిట్ కొట్టాడో లేదో ? చూద్దాం.

TL స్టోరీ:
ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్ విక్ర‌మ్ ( నాగార్జున‌) , ప్రియ ( సోనాల్ చౌహాన్‌) మ‌ధ్య మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉంటుంది. వాళ్లు విదేశాల్లో ఓ ఆఫ‌రేష‌న్ స‌క్సెస్ చేస్తారు. స‌హ‌జీవ‌నంలో ఉండే వీరు చేసిన మ‌రో ఆప‌రేష‌న్ ఫెయిల్ అవుతుంది. నిర్వేదంలో ఉన్న విక్ర‌మ్ త‌న జాబ్‌కు రిజైన్ చేస్తాడు. విక్ర‌మ్ త‌న మాట విన‌డం లేద‌న్న కోపంతో ప్రియ అత‌డిని వ‌దిలేసి ముంబై వ‌చ్చేస్తుంది. ఐదేళ్లు ఇలా గ‌డిచిపోతాయి. ఓ రోజు విక్ర‌మ్‌కు అను ( గుల్ ప‌నాగ్ ) నుంచి ఫోన్ వ‌స్తుంది. త‌న లైఫ్ రిస్క్‌లో ఉంద‌ని.. త‌న కూతురును కొంద‌రు చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని చెపుతుంది. అప్పుడు విక్ర‌మ్ త‌న లైఫ్ రిస్క్ చేసి ఆమె కూతురు సెక్యూరిటీ బాధ్య‌త స్వీక‌రిస్తాడు ? అసలు అనుకు, విక్ర‌మ్‌కు ఉన్న లింక్ ఏంటి ? త‌ర్వాత ప్రియ తిరిగి విక్ర‌మ్ లైఫ్‌లోకి ఎలా రీ ఎంట్రీ ఇచ్చింది ? విక్ర‌మ్‌ను చూసి భ‌య‌ప‌డే ఆ శ‌క్తులు ఏంటి ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌రే ది ఘోస్ట్ సినిమా.

TL విశ్లేష‌ణ :
నాగార్జున ఈ త‌ర‌హా పాత్ర‌లు ఆల్రెడీ వ‌ర్మ ఆఫీస‌ర్‌, ది వైల్డ్ డాగ్‌లో చేసేశాడు. అయితే ఇందులో కేవ‌లం యాక్ష‌న్ కు మాత్ర‌మే కాకుండా కొద్దిగా రొమాన్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌కు కూడా మిక్స్ చేశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్‌. ఎన్ ఐఏకు కార్పొరేట‌ర్ క్రైం మిక్స్ చేసిన ప్ర‌వీణ్ ఈ క‌థ‌రాసుకున్నాడు. నాగార్జున బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా యాక్ష‌న్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్‌మెంట్ కాకుండా రొమాన్స్ మిక్స్ చేశాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం సెంటిమెంట్ కూడా డిజైన్ చేశాడు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది.

విక్ర‌మ్ క్యారెక్ట‌ర్‌లో నాగార్జున బాగా సెట్ అయ్యాడు. యాక్ష‌న్ సీన్స్‌లో చాలా స్టైలీష్‌గా క‌నిపించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువుగా గ్లామ‌ర్ రోల్సే చేసిన సోనాల్ ఇప్పుడు యాక్ష‌న్ సీన్స్‌లో కూడా ఆక‌ట్టుకుంది. కార్పొరేట్ సంస్థ ఎండీగా గుల్ ప‌నాగ్‌, విల‌న్ మ‌నీశ్ చౌద‌రి స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది. భ‌ర‌త్‌, సౌర‌భ్ ఇచ్చిన రొమాంటిక్ ట్యూన్ బాగుంది. మార్క్ కె. రాబిన్ నేప‌థ్య సంగీతం బాగుంది. ముఖేష్ సినిమాటోగ్ర‌పీ సూప‌ర్బ్‌. ఎడిటింగ్ బాగున్నా.. ఇంకా ట్రిమ్ చేయాల్సిన సీన్లు ఉన్నాయి.

సినిమా టేకింగ్‌తో పాటు స్టైలీష్ మేకింగ్‌, నాగ్ – సోనాల్ రొమాన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌, నిర్మాణ విలువ‌లు.. యాక్ష‌న్ హైలెట్స్‌గా నిలిచాయి. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను మ‌రింత బ‌లంగా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. కథను ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా న‌డిపించినా ఇంట‌ర్వెల్‌తో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. ఇంట‌ర్వెల్ అయితే సినిమా చూసేవాళ్ల‌కు మాంచి ఫీస్ట్‌. సిస్ట‌ర్‌సెంటిమెంట్ ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతుంది. సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే ప‌రుగులు పెట్టించాడు ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్‌. ఫ‌స్టాఫ్ క‌న్నా సెకండాఫ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ది ఘోస్ట్ ను ఎక్క‌డికో తీసుకెళ్లాయి.

ఫైన‌ల్‌గా…
నాగ్ ఫ్యాన్స్‌తో పాటు యాక్ష‌న్ సినిమాలు ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌కు పిచ్చ‌గా న‌చ్చుతుంది.

ది ఘోస్ట్ TL రేటింగ్ : 3 / 5

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news