జనరల్ గా మనుషులనాక ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఇష్టమని కూడా చెపవచ్చు. అయితే పెద్దవాళ్ళు అయ్యాక స్టార్ పొజిషన్లోకి వచ్చాక మనలో చాలా చేంజస్ వస్తాయి. అయితే ఇక్కడ ఈ తెలుగు స్టార్ హీరో మాత్రం ఇప్పటికి ఆ పిచ్చి వదులుకోలేదట . తన చిన్ననాటి టైం నుండి ఆ అలవాటు..తనతో పాటే పెరిగి పెరిగి ఇప్పుడు పిచ్చిగా మారిందట. ఆ పిచ్చి ముదిరి ముదిరి ఇప్పుడు పక్కన వాళ్లకి పిచ్చెక్కించే స్దాయికి వచ్చేసిందట. ఇప్పటికి ఇంట్లో వాళ్ళు ఆ విషయం కారణంగా ఈ తెలుగు హీరోని తిడుతూనే ఉంటారట. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఉండి కూడా ఇంకా ఇదేమి పిచ్చి రా నీకు అంటూ వాళ్ళ అమ్మగారు అరుస్తుందట.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్న టాప్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఈయన ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది . అలాంటి ఓ క్రేజీ రికార్డ్స్ సాధించగలిగే సత్తా ఉన్న తెలుగు హీరో ఇతను. అయితే చిన్నతనం నుండి ఈ హీరోకి వీడియో గేమ్స్ పిచ్చి ఉందట. చిన్నతనంలో సరదాగా స్టార్ట్ అయిన ఆ అలవాటు క్రమీన ..రాను రాను అదో వ్యసనంలా మారిపోయింది.
ఆశ్చర్యం ఏంటంటే పెళ్లైనా కానీ ఈ హీరో..ఇంకా వీడియో గేమ్స్ పట్టుకొని ఆడుతూనే ఉంటాడట. ఇప్పటికీ ఈ తెలుగు హీరో రోజు నైట్ వీడియో గేమ్స్ ఆడే పడుకుంటారట. అదేంటో వీడియో గేమ్ ఆడకపోతే..నిద్ర రాదట. దీంతో భార్య కూడా ఆయన ని చాలాసార్లు కోపడ్డిందట. బెడ్ రూంలో వీడియో గేమ్ ఏంటి.. నీకు పిచ్చినా అంటూ చాలా సార్లు మండిపడిందట. అయినా కానీ ఈ తెలుగు హీరో వీడియో గేమ్స్ ఆడుతూనే ఉన్నాడట. ఇప్పటికీ ఆ అలవాటు కంటిన్యూ అవుతుందట. ఏంటో ఈ హీరో అలవాటు ఎప్పుడు మానుకుంటాడో..?