ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. అభిరుచి, ఆసక్తిగల నిర్మాతగా.. ఆయన తీసిన అనేక సినిమాలు హిట్ కొట్టాయి . జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, చూడాలని ఉంది, అశ్వమేథం వంటి.. మెరుపుల్లాంటి హిట్లు కొట్టిన సినిమాలు.. దత్ ఖాతాలోనే ఉన్నాయి. టాలీవుడ్లో ఇప్పటి తరం జనరేషన్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లను వెండితెరకు పరిచయం చేసిన బ్యానర్ అశ్వనీదత్‌దే.
గత కొంత కాలంగా వైజయంతీ బ్యానర్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఆ బ్యానర్‌కు మునుపటి కళ వచ్చేలా చేస్తున్నాయి. మహేష్‌బాబుతో మహర్షి, అంతకు ముందు వచ్చిన మహానటి.. (సావిత్రి నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమా) కూడా అశ్వనీదత్ తీసిందే.. రీసెంట్‌గా సీతారామం సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ కొట్టారు. వాస్తవానికి.. ఆయన వారసులుగా.. కుమార్తెలు ఇండస్ట్రీలోకి వచ్చారు.
కృష్ణా జిల్లాకు చెందిన అశ్వనీదత్ మూవీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత.. సొంతగా సినిమాలు తీయడంపై దృష్టి పెట్టారు. అనేక సినిమాలు తీశారు. అయితే.. ఎన్ని సినిమాలు తీసినా.. దానికంటూ ఒక వేదిక అవసరం కదా! అదే.. అశ్వనీదత్ స్థాపించిన వైజయంతి మూవీ మేకర్స్. ఈ బ్యానర్ కిందనే. అనేక సినిమాలు నిర్మించారు. అయితే..వైజయంతి బ్యానర్ మధ్యలో శంకం పట్టుకుని అన్నగారు ఎన్టీఆర్ రావం చేస్తున్నట్టుగా ఫొటో ఉంది.
అంతేకాదు.. ఈ ఫొటో బ్యానర్ మధ్యలో ఉండడం గమనార్హం. వాస్తవానికి ఎవరూ అప్పట్లో ఎన్టీఆర్ కానీ, ఏ ఎన్నార్ పొటోలను పెట్టుకునేందుకు ఒప్పుకొనేవారు కదు. దీనికి కారణం ఏంటనేది తెలియదు కానీ.. తమ వ్యక్తిగత ప్రచారానికిమాత్రం ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. అయితే.. అశ్వనీదత్ మాత్రం తాను కొత్తగా తీసుకువచ్చిన బ్యానర్‌లో అన్నగారి దీవెనల కోసమే బ్యానర్‌ల మధ్యలొ ఫొటో వేసుకుంటామని అడిగారు.
మొదట్లో ఈ విషయాన్ని అన్నగారు తోసి పుచ్చాలని అనుకున్నా దత్తు మాత్రం పట్టువదల కుండా.. అన్నగారిని వెంబడించారట. ఈ క్రమంలో ఇక, ఇన్ని సార్లు అడుగుతున్న ఓకే చెప్పకపోతే…బాగోదని భావించిన అన్నగారు చిట్టచివరికి అంగీకరించారు. దీంతో వైజయంతి మూవీ బ్యానర్‌లో అన్నగారు శంకంపూరిస్తున్నట్టు మనకు గోచరిస్తుంది. మొత్తంగా ఆసక్తికరమైన విషయాన్ని.. గుమ్మడి తన పుస్తకంలో పేర్కొనడం విశేషం.