ఏంటో పాపం అక్కినేని నాగార్జున టైం అసలు బాగాలేదు . మిగతా స్టార్ హీరోల కొడుకులందరూ వంద కోట్ల క్లబ్ అని ఓ రేంజ్ లో దూసుకుపోతుంటే ..ఈఅయన కొడుకులు మాత్రం ఇంకా సరైన హిట్ ఏ కొట్టలేదు. స్టార్ హీరోల లిస్ట్ లోకి ఎప్పుడు ఆడ్ అవుతారో ..100 కోట్ల క్లబ్ లోకి ఎప్పుడు జాయిన్ అవుతారో.. అక్కినేని నాగార్జున కోరిక ఎప్పుడు తీరుస్తారో ఏంటో అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . సినిమాలపరంగా సక్సెస్ అవ్వలేని హీరోలు లైఫ్లో ఆయన సక్సెస్ అయ్యారా అనుకుంటే అది లేదనే చెప్పాలి .
పేరుకు ఇద్దరు కొడుకులు ఉన్నా కానీ ఇంతవరకు వంశాన్ని నిలబెట్టే పనులు ఒకటి చేయలేదంటూ అక్కినేని హీరోలపై మండిపడుతున్నారు కొందరు జనాలు . మరి ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య అంటే ఇండస్ట్రీలో చులకన భావం ఎక్కువైపోయింది. అక్కినేని నాగచైతన్య మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. సమంతకు విడాకులు ఇచ్చిన తరువాత అది కాస్త పోయింది. అయితే రీసెంట్గా దివాళి సందర్భంగా అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెబుదామనుకున్న నాగార్జునకు చేదు అనుభవం ఎదురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే . శ్రేయ భూపాల్ తో సంబంధం తెంచేసుకున్నాడు అఖిల్ .దానికి గల కారణాలు ఇప్పటికీ చెప్పలేదు. ఆమె హ్యాపీ గా వేరే అతని పెళ్లిచేసుకొని బిడ్డను కూడా కనేసింది. అయితే అక్కినేని అఖిల్ పెళ్లి ఎప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న జనాలకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . అక్కినేని నాగార్జున దగ్గర ఫ్రెండ్ అయినా బిజినెస్ మాన్ కూతురుతో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
దివాళి సందర్భంగా దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేయాలనుకున్నారట . అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఈ సంబంధం వద్దు అంటూ క్యాన్సిల్ చేసుకున్నారట . ఈ క్రమంలోనే దివాళి సెలబ్రేషన్ కు అక్కినేని ఫ్యామిలీ దూరమైనట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో ఇంటికి కొత్త కోడలు రాబోతుందంటూ ఆశగా ఎదురుచూసిన అక్కినేని నాగార్జున – అమల ఆశలు నిరాశగానే మిగిలాయి . ఏది ఏమైనా సరే సినిమాలో హిట్ కొట్టిన నాగార్జున.. కొడుకుల్ని హీరో చేయడంలో.. కొడుకు లైఫ్ సైటిల్ చేయడం లో మాత్రం ఫ్లాప్ అయ్యాడు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.