కొన్నిసార్లు తప్పు చేసినా చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అసలేం జరిగింది…? ఎలా జరిగింది అనేది పట్టించుకోకుండా నిందలు వేస్తూ ఉంటారు. అలా జరిగినప్పుడు జీవితమే నరకంలా మారిపోతుంది. సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా సినిమా తారలకు కూడా ఇలాంటి పరిస్థితులు కొన్ని సార్లు వస్తుంటాయి. అలాంటి పరిస్థితులే ముగ్గురు హీరోయిన్లకు సైతం వచ్చాయి. ప్రేమించిన పాపానికి హత్యా ఆరోపణలు ఎదురుకోవాల్సి వచ్చింది. ఆ ముగ్గురు సెలబ్రిటీలు ఎవరు అలాంటి ఆరోపణలు ఎందుకు ఎదురుకున్నారు అనేది ఇప్పడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడంతో అతడి ప్రేయసి హీరోయిన్ రియా చక్రవర్తి పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన పోలీసులు రియా తప్పు లేదని వెల్లడించారు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ను చంపేసింది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేఖ కూడా అచ్చం రియా చక్రవర్తి లాంటి పరిస్థితిని ఎదురుకుంది. అప్పట్లో బాలీవుడ్ లో అమితాబ్ – రేఖ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
అమితాబ్ – రేఖ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. కానీ అమితాబ్ జయాను పెళ్లి చేసుకోవడంతో ఆ వార్తలకు చెక్ పడింది. ఆ తరవాత రేఖ వ్యాపారవేత్త ముఖేష్ తో ప్రేమలో పడింది. వాళ్ళు ఇద్దరూ పెళ్ళిచేసుకుని హ్యాపీగా ఉండే సమయంలోనే ముకేష్ ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో హీరోయిన్ రేఖ తన భర్త ముకేష్ ను హత్య చేయించింది అంటూ అరోపనలు వచ్చాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తన అందచందాలతో దేశాన్నే ఊపేసిన రేఖ జీవితం చివర్లో చిందరవందర అయిపోయింది.
అంతే కాకుండా నటుడు ప్రదీప్ మరియు పావని రెడ్డి తెలుగు సీరియల్స్ లో నటించారు. కాగా వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా ప్రదీప్ రెడ్డి సడెన్ గా అత్మహత్య చేసుకున్నాడు. దాంతో పావనీ రెడ్డి కారణం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇందులో వాస్తవ, అవాస్తవాలు ఎలా ఉన్నా కేవలం సరైన ఆలోచన లేకుండా ప్రేమలో పడినందుకే ఈ ముగ్గురు హీరోయిన్లు కేసుల్లో చిక్కుకోవాల్సి వచ్చింది.