Moviesఆశిన్ పెళ్ళిలో తాగి గొడవ చేసిన స్టార్ హీరో... పెద్ద ర‌చ్చ...

ఆశిన్ పెళ్ళిలో తాగి గొడవ చేసిన స్టార్ హీరో… పెద్ద ర‌చ్చ జ‌రిగిందిగా…!

కెరియర్ ఎంతో ఉన్నతంగా ఉన్న సమయంలో సినిమాలకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి హఠాత్తుగా మాయమైన హీరోయిన్లలో నటి ఆశిన్ కూడా ఒకరు. ఆమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ పరిశ్రమలో తన సత్తా చాటుకుంటూ ఆయా భాషల్లో అగ్ర హీరోలంద‌రి సినిమాల్లో నటించింది. అదే సమయంలోనే స‌డెన్‌గా పెళ్లి చేసుకుని అన్నీ ఇండస్ట్రీస్ ని షాక్ కి గురి చేసింది ఆశిన్. ఇక భరతనాట్యంలో మంచి డాన్సర్ అయిన ఆశిన్ తన కెరీర్ మొత్తం మీద మూడు ఫిలింఫేర్ అవార్డులను దక్కించుకుంది.

చాల మంది అందంగా ఉండేవారికి పెద్దగా నాలెడ్జి ఉండదు అని అనుకుంటారు. కానీ ఆశిన్ చాల తెలివైన అమ్మాయి. అంతే కాదు మిగతా ఈ హీరోయిన్ల‌కు రాని విధంగా ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడడగలిగిన హీరోయిన్ ఆమె. అందుకే ఎక్కువగా తన సినిమాలకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకునేది. ఒకానొక సమయంలో ఆశిన్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. గజినీ వంటి సినిమాలు ఆమెని తమిళ చిత్ర పరిశ్రమ నుంచి హిందీ భాషలోకి ప్రమోట్ అయ్యేలా చేసాయి.

ఆశిన్ ని అప్పట్లో క్వీన్ ఆఫ్ కోలీవుడ్ అని కూడా కొన్ని పత్రికలు సంబోధించేవి. 2015 వరకు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఆసిన్ 2016 వ సంవత్సరంలో మైక్రోమ్యాక్స్ కో- అధినేత అయిన రాహుల్ శర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే అసలు వీరి పెళ్లి మాత్రం చాలా విచిత్రంగా జరిగింది. అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ 2 సినిమా ప్రమోషన్స్ భాగంలో రాహుల్ శర్మని తొలిసారి కలిసింది ఆశిన్.

ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి సమయంలో కూడా విచిత్రమైన సంఘటన జరగడం అప్పట్లో బాలీవుడ్ మీడియాకి మంచి వార్తను అందించినట్టు అయ్యింది. వివాహం సమయంలో బాలీవుడ్ పెద్దల కోసం ఆశిన్ దంపతులు ఒక విందు ఏర్పాటు చేశారు. ఈ పార్టీ కి బాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది అగ్ర తారలు, సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కూడా పాల్గొన్నారు.

పీకల వరకు తాగిన తర్వాత రిషి కపూర్ పార్టీలో నానా రచ్చ చేయడంతో ఆ వేడుక కాస్త రద్దయ్య పరిస్థితికి వచ్చింది. అక్కడ సంగీతం బాగోలేదని, లైటింగ్ నచ్చలేదంటూ రిషి కపూర్ బాగా హంగామా చేశారు. దాంతో రాహుల్ శర్మ కలిగించుకొని గొడవ సద్దుమణిగేలా చేసినా.. అప్పటికే పార్టీ మూడ్ పాడవడంతో సెలబ్రిటీస్ అంతా వెళ్లిపోయారు. దాంతో కేవలం వేడుక మొదలైన గంటకే పూర్తయిపోయింది. అలా రిషికపూర్ తాగి గొడవ చేయడంతో ఆశిన్ పెళ్ళి విందు పెద్ద ర‌చ్చ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news