సోషల్ మీడియాలో ఎప్పుడూ రక రకాలుగా హాట్ టాపిక్ అవుతోంది అనసూయ భరద్వాజ్. తను వేసుకుంటున్న డ్రస్ విషయంలో..భర్తతో చేసే రొమాన్స్ విషయంలో, ఫొటో షూట్స్ విషయంలో ఇలా ఒకటి కాదు ఈ లేటు వయసు హాటు యాంకరమ్మ పోస్ట్ చేసే వాటి వల్ల బాగా ట్రోల్ అవుతూ ఉంటుంది. అంతమాత్రాన అనసూయ ఏమీ కుదురుగా కూర్చోదు. రివర్స్‌లో ఒక్కొక్కరికీ బాగానే తల తిరిగేట్టుగా సమాధానమిస్తుంది.
అనసూయ లాంటి యాంకర్ ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందంటే తనలోని టాలెంట్ అని ఖచ్చితంగా చెప్పాలి. టాలెంట్‌తో పాటు సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ ట్రోల్స్ ని కూడా బాగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ నిజంగానే అనసూయ బాగానే ఎదుర్కొంటూ వస్తోంది. యాంకర్‌గా తన కెరీర్ జబర్దస్త్‌గా సాగుతోంది. అంతేకాదు, సినిమాల పరంగా కూడా అనసూయ వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
క్షణం .. రంగస్థలం ..పుష్ప..ఈ సినిమాలన్నీ అనసూయకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అంతేకాదు, తనకోసమే దర్శకరచయితలు కొత్త తరహా పాత్రలను రాసేలా నటించి ఆకట్టుకుంటోంది ఆ ముదురు యాంకరమ్మ. అయితే, అనసూయకి టాలీవుడ్‌లో ఓ బడా నిర్మాత ఫుల్ సపోర్ట్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆయనే ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన పీవిపి. ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియదు గానీ ఇండస్ట్రీ వర్గాలలోనూ, నెటిజన్స్‌లలోనూ బాగా మాట్లాడుకుంటుంటారు.
దీనికి కారణం ఓసారి అనసూయ కారుకు యాక్సిడెంట్ అయితే క్షణాల్లో తన ముందు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగిందట. దీనిలో ఎక్కేసి అనసూయ జంప్ అయిందని ఆ మధ్య మాట్లాడుకున్నారు. ఆ కారు పంపింది ఆ బడా నిర్మాతే అని ప్రచారం జరిగింది. యాంకర్స్, హీరోయిన్స్‌కి ఇలా వెనలాక ఎవరో ఒకరు బడా బాబులు ఉండి నడింపచకపోతే మనుగడ కష్టమని ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు.
అయితే, అనసూయ లాంటి సీనియర్ నటి, యాంకర్‌కి ఎవరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని అభిమానులు కౌంటర్స్ ఇస్తున్నారు. ఏదేమైనా ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనసూయ కష్టంతో బాగానే సంపాదించుకుందని సన్నిహితులు చెబుతుంటారు.