టాలీవుడ్‌లో ఇప్పుడు మెగాస్టార్‌గా వెలుగుతున్న అగ్ర హీరో చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎంతటి కష్టాలను అనుభవించారో చాలామందికి తెలిసిందే. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులోకుండా నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చారు. హీరోగా నిలదొక్కుకున్న తర్వాత కూడా పాత్ర నచ్చితే నేను నటుడ్ని.. ఏదైనా చేయాలి అని తనకి తానే ఛాలెంజ్ విసురుకొని శుభలేఖలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి సినిమాలు చేశారు.
అలా అన్నీ రకాల పాత్రలను చేస్తూ మెగాస్టార్‌గా పాపులారిటీ సాధించిన చిరంజీవి ఆ తరం నుంచి నేటి తరం హీరోయిన్స్ వరకు చాలా మందితో రెండేసి మూడేసి సినిమాలు చేశారు. ఇప్పటికంటే అప్పుడు రాధిక, సుహాసిని, సుమలత, భానుప్రియ, విజయశాంతి, రాధ, మాధవి లాంటి వారితో ఎక్కువ సినిమాలు చేసి హిట్ పేయిర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత తరం హీరోయిన్లు అయిన రంభ, రోజా, రమ్యకృష్ణ, సాక్షి శివానంద్, సౌందర్య లాంటి వాళ్లను కూడా రెండు, మూడు సార్లు తన సినిమాల్లో రిపీట్ చేశారు.
మెగాస్టార్ అంటే డాన్స్‌కి పెట్టింది పేరు. ఆయన సరసన నటించే హీరోయిన్ మంచి డాన్సర్ అయితే చాలు..ఇక రెచ్చిపోవడమే. ఆ కాలం హీరోయిన్స్‌లో దాదాపు అందరూ చిరుకి మంచి జోడిగా నిలిచిన వారే. రాధ, రాధిక, విజయశాంతి, మాధవి, భానుప్రియ చిరుతో సరి సమానంగా డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. మెగాస్టార్‌కి అత్యంత ప్రియమైన హీరోయిన్స్‌లో భానుప్రియ ఒకరు. స్టేట్ రౌడి సినిమాలో మెగాస్టార్ – భానుప్రియ కాంబో సీన్స్, సాంగ్స్‌లో డాన్స్ ఎంత హైలెట్‌గా నిలిచాయో అందరికీ తెలిసిందే.
స్లిం పర్సనాలిటీతో భానుప్రియ చిరు సరసన డాన్స్ వేస్తుంటే మాస్ ఆడియన్స్ కేకలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే, చిరంజీవి తన సినిమాలో హీరోయిన్ భానుప్రియ అంటే చాలా సంబరపడేవారట. సాంగ్స్‌లో భానుప్రియతో ఉండే కెమిస్ట్రీకి మెగాస్టార్ చాలా ఆతృతగా చూసేవారట. కథ చెప్పిన తర్వాత దర్శక, నిర్మాతలు హీరోయిన్ ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు భానుప్రియ అయితే బావుంటదని తన అభిప్రాయం చెప్పి తీసుకునేలా ఒత్తిడి చేసేవారని చెప్పుకున్నారు. ఒకరకంగా భానుప్రియతో డాన్స్ చేయడానికి పిచ్చితో ఎదురుచూసేవారని.. మెగా అభిమానులు కొందరు చెప్పుకుంటూనే ఉన్నారు.