Moviesబాల‌కృష్ణ‌ సింహం టైటిల్‌తో, పోలీస్ పాత్ర‌లో చేసిన సినిమాలివే... న‌ట‌సింహంకు తిరుగులేని...

బాల‌కృష్ణ‌ సింహం టైటిల్‌తో, పోలీస్ పాత్ర‌లో చేసిన సినిమాలివే… న‌ట‌సింహంకు తిరుగులేని హిస్ట‌రీ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. బాలయ్య కెరీర్ కు సింహం అన్న టైటిల్ బాగా కలిసి వచ్చింది. బాలకృష్ణ సింహం పేరు కలిసి వచ్చేలా చేసిన సినిమాలే ఆయన కెరీర్‌ను టర్న్‌ చేశాయి. సమరసింహారెడ్డి – నరసింహనాయుడు – లక్ష్మీ నరసింహ – సింహా లాంటి సినిమాలు సూపర్ హిట్ అవడంతో పాటు.. బాలయ్య కెరీర్లో ఎప్పటికీ మరుపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి. బాలయ్య సింహం పేరు కలిసి వచ్చేలా మొత్తం 8 సినిమాలలో నటించారు. సింహం నవ్వింది – బొబ్బిలి సింహం – సమర సింహా రెడ్డి – నరసింహా నాయుడు – సీమసింహం – లక్ష్మీ నరసింహా – సింహా – జై సింహా సినిమాల్లో ఆయ‌న న‌టించారు.

బాలయ్య సింహం పేరుతో కెరీర్లో చేసిన తొలి సినిమా సింహం నవ్వింది. అసలు ఈ సినిమాలో నటించ‌డం బాలయ్యకు ఇష్టం లేదు. ఎన్టీఆర్ బలవంతంతో మాత్రమే నటించారు. బాలయ్య ఊహించినట్టుగానే సింహం నవ్వింది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయేంద్రప్రసాద్ రాసిన కథతో బొబ్బిలి సింహం సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక 1999 సంక్రాంతి కానుకగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆ రోజుల్లోనే సమరసింహారెడ్డి 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

ఇక సమరసింహారెడ్డి వచ్చిన రెండేళ్లకు 2001 సంక్రాంతి కానుకగా నరసింహనాయుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా భారత దేశ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటివరకు దేశంలో ఏ భాషలోనూ ఏ హీరో నటించిన సినిమా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడలేదు. న‌రసింహనాయుడు ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. నరసింహనాయుడు కూడా తిరుగులేని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి బాలయ్యను టాలీవుడ్ శిఖర భాగాన నిలిపింది. నరసింహనాయుడు వచ్చిన ఏడాదికే 2002 సంక్రాంతి కానుకగా సీమ సింహం సినిమా వచ్చింది. బాలయ్య సినిమాలకు కంటిన్యూగా సినిమాటోగ్రాఫర్ గా ఉండే సి.రాం ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సీమసింహం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ మార్కులు వేయించుకుంది.

ఇక సీమ సింహం వచ్చిన రెండేళ్లకు 2004 సంక్రాంతి కానుకగా బాలయ్య లక్ష్మీ నరసింహ‌గా బాక్సాఫీస్ దగ్గర గర్జించారు. చిరంజీవి అంజి – ఎన్టీఆర్ ఆంధ్రావాలా – ప్రభాస్ వర్షం సినిమాలకు పోటీగా వచ్చిన లక్ష్మీ నరసింహ 277 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. కోలీవుడ్లో విక్రమ్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన సామీకి లక్ష్మీనరసింహ రీమేక్ గా తెరకెక్కింది. ఇక బాలయ్య వరుస ప్లాపులతో ఉన్నప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సింహా సినిమాలో నటించాడు. 2010 సమ్మర్ లో వచ్చిన సింహ సూపర్ హిట్ అవడంతో పాటు బాలయ్య కెరీర్‌కు మంచి ఊపు తెచ్చింది.

ఇక 2018 సంక్రాంతి కానుకగా బాలయ్య కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో జై సింహా సినిమాలో నటించారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు పోటీగా వచ్చిన జై సింహా హిట్ అవడంతో పాటు… ఆ యేడాది సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇలా బాలయ్య తన కెరీర్లో సింహం టైటిల్ తో నటించిన సినిమాల్లో చాలావరకు సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అయ్యి బాలయ్య కెరీర్ మార్చేశాయి అలా సింహం సెంటిమెంట్ బాలయ్యకు చాలా వరకు కలిసి వచ్చింది.

 

 

 

అలాగే బాల‌య్య భలే తమ్ముడు – ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ – తిరగబడ్డ తెలుగు బిడ్డ – రౌడీ ఇన్‌స్పెక్టర్ – మాతో పెట్టుకోకు – సుల్తాన్ – భలేవాడివి బాసు – సీమ సింహం – చెన్నకేశవ రెడ్డి – లక్ష్మీ నరసింహా – అల్లరి పిడుగు – రూలర్ వంటి 12 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news