వెండితెరపై వెలుగులు ప్రసరించిన అన్నగారు. ఎన్టీఆర్‌ను వేధించిన సమస్య ఇదే.. అంటారు.. సినిమా ఫీల్డ్ జనాలు. ఎందుకంటే.. ఎన్టీఆర్ అనేక సినిమాల్లో నటించారు. చరిత్రాత్మక, రాజకీయ, సాంఘిక సినిమాల్లో అన్నగారిది అందెవేసిన చేయి. అయితే.. ఆయన సినీ ఫీల్డ్‌లో చివరి వరకు కూడా..ఒక సమస్య ఎదుర్కొన్నారు. దానిని చాలా సార్లు ఖండించారు. కానీ, ఏళ్ల తరబడి ఈ సమస్య ఆయనను వెంటాడింది. అదే ఆర్థిక సమస్య! ఔనా.. నిజమేనా? అంటే.. ఔననే అంటున్నారు గుమ్మడి.
అన్నగారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారు. మరి అలాంటి ఎన్టీఆర్‌కు ఆర్థిక సమస్యలు ఏంటి? అంటు న్నారా ? వాస్తవానికి అన్నగారికి నేరుగా ఎదురైన సమస్య కాదు.. ఆయన సోదరుడు త్రివిక్రమరావుకు ఎదు రైన సమస్యలు. ఆ సమస్యలే.. అన్నగారిని చాలా వరకు వేధించాయని.. గుమ్మడి పేర్కొన్నారు. ఆర్థికంగా.. అన్నగారు చాలా వరకు బలంగానే ఉండేవారని.. ఎలాంటి సమస్య రాకుండా చూసుకున్నారని..ఆయన తెలిపారు. అయితే.. తన తమ్ముడి.. కుటుంబం గురించి ఎక్కువగా చింతించేవారని అన్నారు.
త్రివిక్రమరావును ఫీల్డ్‌కు తీసుకువచ్చింది.. ఎన్టీఆర్. అయితే.. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. తీర్చిదిద్దాలని అనుకున్నా.. దర్శకుడు కేవీ రెడ్డి సూచనలతో.. ఆయనను టెక్నికల్ ఫీల్డ్‌కు పరిమితం చేశారు. తర్వాత.. అన్నగారి ప్రోత్సాహంతో నిర్మాతగా కూడా.. మారారు. మొదట్లో బాగానేఉన్నా.. తర్వాత.. అన్నగారితో కాకుండా..యువ నటులతో త్రివిక్రమరావు చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టాయి. దీంతో ఆర్థికంగా నష్టాల్లో మునిగిపోయారు. తర్వాత, ఎన్ ఏటీ కంబైన్స్‌ను కూడా విక్రయించేశారని.. అన్నారు.
మరి ఇన్ని జరిగినా.. ఎన్టీఆర్ ఆదుకోలేదా? అనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వస్తుంది. కానీ, త్రివిక్రమ రావుకు చేయి చాపే ఉద్దేశం లేదని గుమ్మడి పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్‌కు ఉమ్మడి ఆస్తుల్లో వచ్చిన వాటిలో చాలా వరకు త్రివిక్రమరావుకు ఇచ్చేశారట. చివర్లో తమ్ముడి కోసం రెండు సినిమాలు చేయడంతో పాటు మద్రాస్ అవుట్‌కట్స్‌లో తమ్ముడి పేర మీద కొన్ని ఆస్తులు కొనుగోలు చేశారు. అలా ఆర్థికంగా తన తమ్ముడు త్రివిక్రమరావును సెటిల్ చేసే వరకు ఎన్టీఆర్ నిద్ర పోలేదు.