శృంగార తార షకీలా అంటే తెలియని వాళ్ళు ఉండరు. సినిమాల్లో వ్యాంప్ పాత్రలు చేస్తూ షకీలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అప్పట్లో షకీలా సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యేవి. అంతే కాకుండా స్టార్ హీరోల రేంజ్ లో షాలోయింగ్ ఉండేది. అసలు షకీలా సినిమాలు వస్తున్నాయంటే ఒకానొక టైంలో మళయాళంలో స్టార్ హీరోలు సైతం తమ సినిమాలు వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
కెరీర్ ప్రారంభం లో వ్యాంప్ పాత్రలు చేసిన షకీలా ఆ తర్వాత ఎక్కవగా ఏకంగా శృంగార పాత్రలే చేసింది. ఇక థియేటర్లలో షకీలా కనిపించిన ఒకటి రెండు సీన్లకే విజిల్స్ వినిపిస్తుంటాయి. షకీలా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులు తనను దూరం పెట్టారని కేవలం తాను సంపాదించిన డబ్బులకి మాత్రమే వాళ్ళు విలువ ఇచ్చేవాళ్ళని అవేదనం వ్యక్తం చేసింది. షకీలా అప్పట్లో శృంగార సినిమాలు చేసి డబ్బులు సంపాదించి తన బంధువుల వద్ద ఉంచింది.
అయితే వారే ఆమెను మోసం చేశారు. దాంతో కొంతకాలానికి ఇంటి నుండి బయటకు వచ్చిన షకీలా ఆ తరవాత ఒంటరిగానే ఉంటుంది. షకీలా జీవితంలో కూడా ఒకరిని లవ్ చేసింది.. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ అలా జరగలేదు. ఇక ఆ వ్యక్తి వయసు కేవలం ముప్పై ఏళ్లు మాత్రమే. ఇక ఆ వ్యక్తి గురించి ఓ ఇంటర్వ్యూలో షకీలా షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను 30 ఏళ్ల వ్యక్తితో లవ్ ట్రాక్ లో ఉన్నానని చెప్పింది. తన వయసు అప్పటికే 53 సంవత్సరాలు అని తెలిపింది. అతడు తనను చాలా కేరింగ్ గా చుసుకుంటాడని.. నిజమైన ప్రేమ అలానే ఉంటుందేమో అని వ్యాఖ్యానించింది.
తమ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువని అందుకే అతడిని పెళ్లి చేసుకోని కూడా చెప్పింది. కానీ జీవితాంతం అతడిని ప్రేమిస్తూనే ఉంటానని… ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ వచ్చి చాలా కాలం గడించింది. కానీ షకీలా పెళ్లి చేసుకున్నట్టు ఎలాంటి వార్తలు వినిపించలేదు. ఇక షకీలా గతంలోనో కొంతమంది తో ప్రేమాయణం నడిపింది.
పలువురు సినిమా వాళ్ళతో పాటు బయట వ్యక్తులతో కూడా అఫైర్ లు పెట్టుకుంది. ఒక్కరూ ఇద్దరు కాకుండా ఏకంగా మొత్తం ఎనిమిది మందితో షకీలా లవ్ ఎఫైర్లు నడిపిందట. ఆ అయితే వాళ్ళతో కూడా షకీలా పెళ్లి వరకు వెళ్ళలేదు. కానీ ఆమె అభిమానులు మాత్రం షకీలా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు.