Moviesఇండ‌స్ట్రీలో అలాంటి అమ్మాయిల‌నే ముందు ట్రాప్ చేస్తారు... న‌టి అర్చ‌న బోల్డ్...

ఇండ‌స్ట్రీలో అలాంటి అమ్మాయిల‌నే ముందు ట్రాప్ చేస్తారు… న‌టి అర్చ‌న బోల్డ్ కామెంట్స్ ర‌చ్చ‌..!

టాలీవుడ్ లో హీరోయిన్లుగా నటించి ఆ తరవాత కనుమరుగైన హీరోయిన్స్ లో అర్చన కూడా ఒకరు. హీరోయిన్ అర్చన కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించారు. అర్చన సిద్దార్థ్ హీరోగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సిద్దార్థ్ కు బంధువుగా నటించి మెప్పించింది. ఆ సమయం లోనే అర్చన కు ప్రముఖ సీనియర్ దర్శకులు బాపు దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. బాపు డైరక్షన్ లో తెరకెక్కిన రాధా గోపాలం సినిమాలో హీరోయిన్ గా మొదట అర్చనను అనుకున్నారట.

కానీ అర్చన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కోసం బాపు డైరెక్షన్ లో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత నరేష్ హీరోగా నటించిన నేను సినిమాతో పాటు చాలా సినిమాల్లో అర్చన హీరోయిన్ గా నటించింది. అయితే తెలుగమ్మాయికి టాలీవుడ్ లో అవకాశాలు రావని చెబుతూ ఉంటారు. అర్చన విషయంలో కూడా అదే జరిగింది. అర్చనకు ఆశించిన రేంజ్ లో అవకాశాలు రాలేదు.

దాంతో కొన్ని సినిమాల్లో మెరిసి చాలా కాలం పాటు సినిమాలకు దూరం అయ్యింది. తెలుగులో బిగ్‌బాస్ సీజన్ వన్ లో ఎంట్రీ ఇచ్చిన అర్చన చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకున్న అర్చన సినిమాలకు దూరంగానే ఉంటుంది. తాజాగా ఓ యుట్యూబ్ ఛానెల్‌కు అర్చన ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

ఓ డైరెక్టర్ ఉన్నాడని ఆయన స్క్రిప్ట్ చెప్పేటపుడు ఒకలా… షూటింగ్ సమయంలో మరోలా సీన్స్ చేస్తున్నప్పుడు మరోలా ప్రవర్తిస్తారని వెల్లడించింది. అంతే కాకుండా ఇండస్ట్రీలో ఓ అమ్మాయి మైండ్ సెట్ వీక్ గా ఉందని తెలిస్తే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళు చాలా మంది ఉంటారని హెచ్చరించింది. అలాంటి ఘటన తన జీవితంలో కూడా జరిగించని… తొందరగా రియాక్ట్ అవ్వడం వల్ల తాను బయటపడినట్టి పేర్కొంది. అయితే అర్చ‌న చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియా స‌ర్కిల్స్‌లో ర‌చ్చ‌గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news