Moviesటైం మెషీన్ లో వెనక్కి వెళ్లే అవకాశం ఉంటే..సుధీర్ తో అలాంటి...

టైం మెషీన్ లో వెనక్కి వెళ్లే అవకాశం ఉంటే..సుధీర్ తో అలాంటి పని.. సిగ్గుతో రష్మి ఉక్కిరి బిక్కిరి..!!

సిల్వర్ స్క్రీన్ పై నాగార్జున-అమల జంట ఎంత పాపులారిటీ దక్కించుకుందో..బుల్లితెరపై అలాంటి ఓ పాపులారిటీ దక్కించుకున్న జంట ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేర్లు సుధీర్-రష్మీ. ఇద్దరి కెమిస్ట్రీకి ఫిదా అయిపోతారు జనాలు . జబర్దస్త్ అనే షో ద్వారా రష్మీ సుధీర్ ఫామ్ లోకి వచ్చారు . యాంకర్ గా రష్మీ కమెడియన్గా సుధీర్ ఇద్దరు తమ కెరియర్లో ముందుకు దూసుకెళ్తున్నారు . అయితే కొన్ని అనుకోని కారణాల చేత సుధీర్ ఈటీవీ జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. ఈ కారణంగానే ప్రజెంట్ సుధీర్ పేరు జబర్దస్త్ లో చాలా తక్కువగా వినిపిస్తుంది.

అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో మరోసారి సుధీర్ పేరు హైలెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది . కాగా రీసెంట్ ప్రోమో ఆధారంగా జబర్దస్త్ షోలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ హైలైట్ గా మారినట్లు చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అవకాశం ఉంటే టైం మెషిన్ ద్వార వెనక్కి వెళ్లి తమ లైఫ్ లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనుకుంటున్నారో ఒక్కో కంటెస్టెంట్ చెప్పుకువస్తారు. ఈ క్రమంలోనే సన్నీ .. నిన్న మందు కొట్టలేదు నాకు అవకాశం వస్తే వెంటనే వెనక్కి వెళ్ళి మందు కొట్టేసి వస్తాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూస్తాయి.

ఇక ఆ తర్వాత కుష్బూ అందుకొని చాలా ఎమోషనల్ సీన్ ని బయట పెట్టింది. ఆమె 1984లో సినిమా ఇండస్ట్రికి వచ్చిందని.. అప్పటి నుంచి ఒబెన్ అనే ఆంటీ ఆమెకు హెయిర్ స్టైలిష్ గా ఉండే వారిని ..కాగా 2011లో ఆమె క్యాన్సర్ తో చనిపోయారని,, ఒకవేళ నాకు అవకాశం వస్తే ఆమెను తిరిగి బ్రతికించుకుంటానని చెప్పడంతో ఒకసారి షో మొత్తం ఎమోషనల్ అయిపోతుంది.

ఈ క్రమంలోనే రాంప్రసాద్ రష్మిని అడుగుతూ ..”నువ్వు టైం మెషిన్ లో వెనక్కి వెళ్లాలనుకుంటే ఎక్కడికి వెళ్తావు” అంటూ ప్రశ్నించగా ఒక్కసారిగా మేటర్ లోకి ఎంటర్ అయిన గెటప్ శ్రీను నేను చెప్తా నేను చెప్తాను అంటూ ..”సుడిగాలి సుదీర్ రష్మి ఫస్ట్ రొమాన్స్ గురించి బయట పెడతారు. అంతేకాదు 2014 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున అంటూ శ్రీను హాట్ సింబల్ చూపిస్తుండగా ..రష్మీ ఓ వైపు సంతోషం మరో వైపు సిగ్గు ..మరోవైపు బాధ తో కలిసిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ప్రోమోకి హైలెట్గా మారింది”. కాగా ఈ ఎపిసోడ్ కి జడ్జిలుగా కృష్ణ భగవాన్ , కుష్బూ వ్యవహరిస్తున్నారు. మరి చూడాలి టోటల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news