టాలీవుడ్ లో 1990ల్లో వెండితెరను తన అందచందాలతో ఒక ఊపు ఊపేసింది విజయవాడ అమ్మాయి రంభ. రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఆమె సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె పేరును రంభగా మార్చారు. విజయలక్ష్మి అంటే మరి పాత పేరులా ఉందని… రంభ అంటే కొత్తగా ఉందని భావించడంతో ఆమె పేరు రంభగా మారిపోయింది. కెరీర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్ తో చిన్నాచితకా సినిమాలు చేసిన రంభ ఆ తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. చాలా తక్కువ టైంలోనే మెగాస్టార్ చిరంజీవితో హిట్లర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
అప్పట్లో రంభ భారీ అందాలు అంటే యువతలో మంచి క్రేజ్ ఉండేది. టాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన రంభ ఆ తర్వాత భోజ్‌పురి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. భోజపురి సినీ జనాలు అయితే రంభ అందాలు చూసి మైకంలో పడిపోయారు. కేవలం భోజ్‌పురి సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. అక్కడ స్టార్ హీరోలు సైతం రంభను ఓ ఆరాధ్య దేవతలా ఆరాధించారు. కొన్నేళ్లపాటు భోజ్‌పురి సినీ ఇండస్ట్రీని రంభ ఒక ఊపు ఊపేసింది.
అక్కడ స్టార్ హీరోలుగా ఉన్న మనోజ్ తివారి – రవికిషన్ సింగ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో పదే పదే ఛాన్సులు కొట్టేసింది. రంభకు అక్కడ ఏకంగా పూజలు కూడా చేసేవారు. రంభ నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆమె భారీ కటౌట్లు పెట్టి మరి పాలాభిషేకాలు చేసేవారు. భోజ్‌పురి భాషలో రంభకు అంత క్రేజ్ వచ్చేసింది. భోజ్‌పురి భాషలో ఆమె టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే అక్కడ స్టార్ హీరోగా ఉన్న మనోజ్ తివారితో ఆమె ప్రేమలో పడిందనే అంటారు.
కొంత కాలం పాటు వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకానొక దశలో వీరు పెళ్లి చేసుకుంటారు అనే వరకు వచ్చింది. అయితే అప్పటికే మనోజ్ తివారికి పెళ్లయిపోయింది. ఆ తర్వాత రంభ భోజ్‌పురిలో సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. చివరకు కాస్త లేట్ ఏజ్‌లో కెనడాలో ఉంటోన్న ఎన్ఆర్ఐ ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుంది. అలా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. చాలా యేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న రంభ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.