ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు “కాంతారా”. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనాలు ఎన్నో ..ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయి కోట్లు కలెక్ట్ చేస్తుంది. పెట్టిన దానికి డబల్ , ట్రిపుల్ టైమ్స్ ప్రాఫిట్స్ తీసుకొస్తూ సినీ ఇండస్ట్రీ లెక్కలను మొత్తం తారుమారు చేసేసింది ఈ కాంతారా.
ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రముఖులు సామాన్యులు అద్భుతం అంటూ ఓ రేంజ్ లో రిషబ్ శెట్టిని పొగిడేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాకి కర్త – కర్మ – క్రియ మొత్తం రిషబ్ శెట్టి అంటూ ఆయన పేరు మారుమ్రోగిపోయేలా చేస్తున్నారు. కాగా రీసెంట్ గా ఈ సినిమా చూసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కాంతారా సినిమాను పొగిడేశారు . కాంతార చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ట్విట్ చేశారు . దీంతో ఒక్కసారిగా ఈ సినిమా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది.
రజనీకాంత్ ట్వీట్ చేస్తూ..” తెలిసింది గోరంత తెలియంది కొండంత” ఈ విషయాన్ని హోమ్బలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన కాంతార చిత్రంలో చెప్పినంత గొప్పగా మరొకరు చెప్పలేరేమో. ఈ సినిమా నా రోమాలు నిక్కబొడిచేలా చేసింది. నటుడు, రచయిత, దర్శకుడు బాధ్యతలు నెరవేర్చిన రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. ఇలాంటి మాస్టర్ పీస్ ఇండియన్ సినిమాకు అందించిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు… అంటూ కామెంట్ చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజన్స్ ఆయన మాటలను తప్పుపడుతున్నారు.
నిజానికి కాంతారా సినిమాను అంత అద్భుతంగా వర్ణించాల్సిన అవసరం లేదని ..బాహుబలి తో కంపేర్ చేస్తే కాంతారా సినిమా లో చెప్పుకోతగా ఎలిమెంట్స్ లేవని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కావాలనే కన్నడ ఇండస్ట్రీని హైప్ తీసుకోరాడానికి ఇలా కొందరు చేస్తున్నారని ఏదిఏమైనా గాని టాలెంట్ ఉంటే ఎక్కడైనా జనాలు ఆదరిస్తారని ..అది ఆర్ ఆరార్ ఆర్తో మరోసారి రాజమౌళి ప్రూవ్ చేస్తారని చెప్పుకొస్తున్నారు .దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కాంతారా వ్స్ బాహుబలి ట్యాగ్స్ వైరలొ గా మారాయి.