Movies"పుష్ప" అట్టర్ ఫ్లాప్ మూవీ..సంచలన విషయాలు బయటపెట్టిన స్టార్ డైరెక్టర్..!!

“పుష్ప” అట్టర్ ఫ్లాప్ మూవీ..సంచలన విషయాలు బయటపెట్టిన స్టార్ డైరెక్టర్..!!

” పుష్ప.. పుష్ప రాజ్ ..నీ యవ్వ తగ్గేదేలే”.. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తరకెక్కిన సినిమా “పుష్ప- ది రైజ్”. గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసింది. ఇప్పటివరకు ఇదే అనుకున్నారు జనాలు. అయితే పుష్ప సినిమా హిట్ కాదు అట్టర్ ఫ్లాప్ మూవీ అంటూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ సంచలన విషయాలను బయటపెట్టాడు. దీంతో డైరెక్టర్ తేజ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

అంతేకాదు అల్లు అర్జున్ అభిమానులు తేజ పై మండిపడుతున్నారు నువ్వు ఫెడౌట్ డైరెక్టర్ వి నీ రివ్యూ ఎవరికి కావాలి అంటూ ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన పుష్ప సినిమా ఆయన కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కింది. సుకుమార్ డైరెక్షన్ ఈ సినిమాకి ఓ ప్లస్ పాయింట్ అయితే అల్లు అర్జున్ కష్టం, శ్రమ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ .నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో డి గ్లామరస్ రోల్ లో నటించి యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు పెట్టిన ఖర్చులకి డభుల్ లాభాలు తీసుకువచింది అంటూ సినిమా నిర్మాతలు గర్వంగా చెప్పుకున్నారు. అంతేకాదు నార్త్ లో ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా టాక్ సంపాదించుకుంది. దీంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

కాగా, మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానున్న పుష్ప 2కు అల్లు అర్జున్ ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ కూడా బయటకు వచ్చింది. అంతలా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ డైరెక్టర్ తేజ పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ..” ఈ సినిమా అసలు హిట్ అవ్వలేదని నార్త్లో హిట్ అయిన కారణంగా ఇక్కడ జనాలు హిట్ టాక్ వచ్చింది అని అనుకుంటున్నారని . అసలు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే పుష్ప సినిమా ను కొనుకున్న చాలా మంది బయ్యర్లు అప్పుల పాలై అల్లాడిపోతున్నారని చెప్పుకొచ్చారు. తెలుగులో చాలా ఏరియాలో బయ్యర్లకి పుష్ప చిత్రం భారీ లాస్ మిగిల్చిందని”.. తేజ చెప్పుకొచ్చారు. తెలుగులో ఈ చిత్రం మొత్తం డబ్బు రికవరీ చేయలేదని నష్టాలు ఎక్కువగా ఉన్నాయని కానీ పుష్ప టీం ఆ విషయాన్ని దాచిపెట్టి సినిమాకు వాళ్లే హైప్ ఇచ్చుకున్నారని” సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తేజా కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మరి చూడాలి దీనిపై పుష్ప టీం ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news