ప్రగ్య జైశ్వాల్ కెరీర్ అంతంత మాత్రమే సాగడానికి వారే కారణమా..? అనే మాట తరుచుగా వినిపిస్తోంది. వారు అంటే ఎవరూ..అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే దర్శకులే. వారివల్లే మంచి స్టార్ స్టేటస్ అందుకోవాల్సిన ప్రగ్య జైశ్వాల్ అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్గా నటించిన గత చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించారు.
వాస్తవంగా ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్, నయనతార, ప్రయాగ మార్టిన్, సాయేషా సైగల్ లాంటి హీరోయిన్స్‌ను పరిశీలించారు. చివరికి ఇందులో హీరోయిన్గా అవకాశం ప్రగ్య జైశ్వాల్ కి దక్కింది. దీనికి ముందు అసలు హీరోయిన్గా ఛాన్సులు రాక నానా ఇబ్బందులు పడింది. అయితే, ఒకేసారి ఇటు అఖండ, అటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశాలు రాగానే ఇక తిరుగు లేదనుకున్నారు.
కానీ, ఊహించని విధంగా సల్మాన్ సినిమాలో నటించినా కూడా సినిమా రిలీజయ్యాక ప్రగ్య జైశ్వాల్ క్యారెక్టర్ లేకపోవడం షాకింగ్ విషయం. ఇక తెలుగులో భారీ హిట్ ఇచ్చిన బోయపాటి, క్రిష్ ఆ తర్వాత మంచి రోల్స్ ఇవ్వలేకపోయారు. కంచె సినిమాలో పాత్ర ప్రగ్య జైశ్వాల్ లైఫ్‌ను టర్న్ చేస్తుందనుకున్నారు. కానీ, అదే మైనస్ అయిందని తర్వాత చెప్పుకున్నారు. ఇక్కడ గ్లామర్ రోల్స్ చేయడం కూడా చాలా అవసరం. కానీ, కంచె ఆ తరగా సినిమా కాదు.
ఇక ఆచారి అమెరికా యాత్ర, జయ జానకి నాయక సినిమాలలో ప్రగ్య జైశ్వాల్ కి ఇంపార్టెంట్ రోల్స్ దక్కలేదు. ప్రగ్య జైశ్వాల్ లాంటి గ్లామర్ బ్యూటీకి దర్శకులు సరైన అవకాశాలు ఇవ్వలేకపోవడం వల్లే తన కెరీర్ ఇప్పుడు డైలమాలో పడింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా నక్షత్రం సినిమాలో ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చి దెబ్బకొట్టాడు. ఒకరకంగా ప్రగ్య జైశ్వాల్ ఫెల్యూవర్స్ కి కారణం దర్శకులే అని చెప్పక తప్పదనే అభిప్రాయాలు నెటిజన్స్‌లో వెల్లువెత్తుతున్నాయి.