ఒక్క బాహుబలి మూవీ సిరీస్ ప్రభాస్ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పాయి. ఈ సినిమాల తర్వాత చైనా, జపాన్ లాంటి దేశాలలో ప్రభాస్‌కి అసాధారణమైన క్రేజ్ పెరిగిపోయింది. అక్కడ ఏకంగా ప్రభాస్‌కి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం.. అభిమాన సంఘాలు ఏర్పడటం ఎవరూ ఊహించంది. ఈ రేంజ్ క్రేజ్ అంతకముందు వరకూ కేవల తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి మాత్రమే ఉండేది. మన సౌత్ హీరోలలో ఆయనకే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.
ఆ తర్వాత మళ్ళీ మన సౌత్ నుంచి మరీ ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ప్రభాస్‌కి ఈ గౌరవం దక్కింది. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, ఈ క్రేజ్ మన డార్లింగ్ కెరీర్‌ను బాగా దెబ్బ తీసింది కూడా. భారీ అంచనాలు పెరగడంతో ఆ అంచనాలను మించే సినిమాలను చేయలేక సీన్ రివర్స్ అవుతోంది. ఆయన నుంచి వచ్చిన రెండు భారీ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ ఇంపాక్ట్ ఆయన సరసన నటించిన హీరోయిన్స్‌కి పడింది.
ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ మీద బాగా పడింది. హిందీలో మంచి క్రేజీ హీరోయిన్‌గా వెలిగిన శ్రద్దా అక్కడ చేసిన సినిమాలు మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి. ఆషికీ 2తో హీరోయిన్‌గా హిందీ సీమలో ఎంట్రీ ఇచ్చిన ఈ నాజూకు భామ..ఆ తర్వాత అక్కడ నటించిన సినిమాలతో వరుసగా హిట్స్ అందుకంది. దాంతో బాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది. ఆ క్రేజ్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా నటించేలా అవకాశం తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ నుంచి ఒక్కసారిగా టాలీవుడ్‌లో ఛాన్స్, అది కూడా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో అంటే శ్రద్దా మాత్రమే కాదు.. ఏ బాలీవుడ్ హీరోయిన్ అయినా కెరీర్ ఓ రేంజ్‌లో ఊహించుకుంటుంది. అదే రేంజ్‌లో తన కెరీర్‌ను శ్రద్దా కపూర్ కూడా ఊహించుకుంది. కానీ, సాహో భారీ డిజాస్టర్ కావడం శ్రద్ద ఊహలన్ని గాల్లో కలిసిపోవడం అలా జరిగిపోయాయి. విచిత్రం ఏంటంటే సాహో సినిమా తర్వాత శ్రద్దా కెరీర్ బాలీవుడ్‌లోనూ నెమ్మదించింది. అక్కడ అవకాశాలే కరువయ్యాయి