సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలు మరింత పాపులర్ అయిపోతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి రాకముందు ఏదైనా సెలబ్రిటీ లు డ్రెస్ వేసుకున్న కాని, ఒక నగపెట్టుకున్నా కానీ.. వాటికి సంబంధించిన బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతున్న కానీ ..జనాలకి వాటి గురించి పూర్తి వివరాలు తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియా పూణ్యమా అంటూ స్టార్ సెలబ్రిటీస్ వాడుతున్న బ్రాండ్స్ గురించి వాటి కాస్ట్ గురించి సామాన్య ప్రజలకు ఇట్టే తెలిసిపోతున్నాయి . ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ గురించి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .
ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వేసుకున్న షూస్ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తుంది. మనకు తెలిసిందే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలన్నీ రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ తనదైన స్టైల్ లో జనాలకు దగ్గరవుతున్నాడు . ఈ క్రమంలోనే ఆయన ఎప్పుడో స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు షూటింగ్ కి బ్రేకులు వేసుకుంటూ వచ్చారు. కాగా ప్రొడ్యూసర్స్ లాస్ అయిపోతున్న టైం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చింది హరిహర వీరమల్లు టీం.
ఈ క్రమంలోనే అందరి కళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పడ్డాయి . స్టైలిష్ లుక్స్ లో మెరిసిన పవన్ కళ్యాణ్.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాలిటిక్స్ లోకి వచ్చాక పవన్ ట్రెండీ బట్టలు వేసుకోవడం చాలా రేర్ గా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చాలా పవన్ జీన్స్ రెడ్ షర్ట్ తో సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో అందరిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వేసుకున్న షూస్ పై అందరి కళ్లు పడ్డాయి. చూడగానే అట్రాక్ట్ చేస్తున్న ఈ షూస్ ఖరీదు ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ధరించిన ఈ షూస్ విలువ అక్షరాల 11994 యూరోలు అంటే.. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 9.7 లక్షలు అని అర్థం. దీంతో ఒక సామాన్యుడు ఇల్లు కూడా కట్టేసుకోవచ్చు అంటున్నారు జనాలు. ఈ షూస్ కోపెన్ హాగన్ (Copenhagen CPH460M MMCM) బ్రాండ్ కి చెందినవి