Moviesఅప్పట్లో బసవతారకమ్మ..ఇప్పుడు ఆ స్టార్ హీరో భార్య..చేస్తున్నపనికి దండం పెట్టాల్సిందే..!!

అప్పట్లో బసవతారకమ్మ..ఇప్పుడు ఆ స్టార్ హీరో భార్య..చేస్తున్నపనికి దండం పెట్టాల్సిందే..!!

బసవతారకమ్మ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .స్వర్గీయ నందమూరి నట సార్వభౌముడు తారక రామారావు గారి భార్య. బసవతారకమ్మ గురించి చాలా తక్కువ మందికే తెలుసు . ఎందుకంటే ఆమె ఎప్పుడూ కూడా బయట ఎక్కువగా కనిపించేది కాదు.. భర్తే ఆమె ప్రపంచం. తారక రామారావు గారి సినిమా షూటింగుల్లో కూడా ఆమె దూరంగా ఉంటుంది. అచ్చ తెలుగు ఇల్లాలు లా తన పని తాను చేసుకుని పోతు ఉండేది. అయితే ఆమెలో ఉన్న మంచి గొప్ప గుణం ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో భార్యకి ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.


మనకు తెలిసిందే ఎన్టీఆర్ మంచి మనసున్న మనిషి. గొప్ప నటుడు ..పక్కవాళ్లు బాధపడితే చూడలేని మనస్తత్వం. బసవతారకం మనసు అలాంటిదే ..ఎవరైనా ఇంటికి వస్తే చాలు కడుపునిండా అన్నం పెట్టకుండా పంపించదు , అది ఎలాంటి వారైనా సరే.. ఎన్టీఆర్ కోసం వచ్చే ఫ్రెండ్స్ అయినా ..ఎన్టీఆర్ కి కథ చెప్పడానికి వచ్చే డైరెక్టర్స్ అయినా.. ఆఖరికి ఆయనని కలవడానికి వచ్చే ఫ్యాన్స్ కి అయినా సరే ఆమె ఇంటికి వచ్చిన ఎవరైనా సరే అన్నం పెట్టకుండా పంపించదు . కడుపునిండా అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చి పంపిస్తుంది.

ప్రజెంట్ ఇంచుమించు అదే అలవాట్లు ఉన్నాయి టాలీవుడ్ మెగాస్టార్ హీరో చిరంజీవి భార్య సురేఖ కి . ఎస్ సురేఖ గారు కూడా అంతే ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేయకుండా బయటికి పంపించదు. ఈ మాట అందరూ చెప్పిందే. స్టార్ హీరోయిన్ రాధిక, రాధ, రోజా అందరూ మనకి గత ఇంటర్వ్యూలో చెప్పారు . “సురేఖ గారు మేము షూటింగ్ టైం లో ఇంటికి వెళ్తే మాకు అన్ని దగ్గరుండి చూసుకునే వాళ్ళని ..మాకు కావాల్సినవన్నీ వండి పెట్టే వారిని ..అంత మంచి మనసున్న ఆమెను మేము ఎప్పుడు చూడలేదని “చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా సరే అప్పట్లో బసవతారకమ్మ ఎంత మంచి పేరు సంపాదించుకుందో ఇప్పుడు సురేఖ కూడా అంతే మంచి పేరు సంపాదించుకుంటుంది. ఇలాంటి ఇద్దరు కోడలు మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం నిజంగా గర్వకారణం అనే చెప్పాలి. ఇలాంటి వారిని చూస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!!

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news