ఇటీవల మృతి చెందిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదునైన ఆలోచనలు.. మంచి భాషణం ఉన్న ఆయన తెలుగు సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా.. తర్వాత కాలంలో అన్నగారు ఎన్టీఆర్ ఆశీర్వాదంతో నిలదొక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన స్వగతం.. `నవ్విపోదురుగాక“ పుస్తకంలోనే రాసుకున్నారు. విజయవాడకు చెందిన మురారి.. ఎంబీబీఎస్ చదవాలని అనుకున్నారు. చదివారు కూడా.
అయితే.. అప్పటికే ఆయన వ్యాపారాలు రాయడం, సినిమా రివ్యూలు రాయడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వృత్తిపై కంటే.. సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని మద్రాస్ వెళ్లారు. అక్కడ అనేక తిప్పులు పడ్డారు. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో అన్నగారు ఎన్టీఆర్‌తో పరిచయం అయింది. ఆయన మురారిని తొలుత హెచ్చరించారు. వైద్య వృత్తిని వదిలేసి ఎందుకు వచ్చారు.. ప్రజలకు సేవ చేసే అవకాశం కోల్పోతున్నారు! అని చెప్పారట.
దీంతో ఒక సందర్భంలో మురారి తిరిగివిజయవాడ వచ్చేయాలని అనుకున్నారు. మళ్లీ ఆయన ఎందుకో.. ఒక సారి తనమనసులో మాటను అన్నగారికి చెప్పాలని అనుకుని.. స్వయంగా ఆయన వద్దకు వేళ్లారు.
అప్పటికే.. అన్నగారు.. ఆయన కుమారుడు బాలయ్యలు.. మంచి ఫామ్‌లో ఉన్నారు. సినిమాల్లోనే ఉండాలని.. ఈ ఇండస్ట్రీని వదిలి పెట్టడం తనకు ఇష్టం లేదని.. మురారి చెప్పడంతో.. ఆయనను ప్రోత్సహించాలని ఎన్టీఆర్ నిర్ణయించారట.
ఈ సమయంలోనే బాలయ్య బాబుతో సినిమా తీస్తావా? అని అడిగారట. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీనే వద్దు.. ఊళ్లోకి వెళ్లి వైద్యం చేయాలన్న అన్నగారు.. ఒక్క సారిగా..బాలయ్యతో సినిమా తీస్తావా? అని అడిగే సరికి.. మురారి ఉబ్బితబ్బిబ్బయ్యారట. అయితే.. మొదట్లో ఇది సాధ్యం కాలేదు. దీంతో సహాయ దర్శకుడిగా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఈ క్రమంలోనూ అన్నగారు తనకు సాయం చేశారని.. ఆయన రాసుకున్నారు.
అయితే.. అన్నగారి ఆశీర్వాదమే తనను నడిపించిందని..అనేక చిత్రాలను అందించేందుకు దోహదపడిందని ఆయన చెబుతారు. ముఖ్యంగా కె. రాఘవేంద్రరావు పరిచయం.. మరింతగా తన కెరీర్‌ను మలుపు తిప్పిందని.. మురారి పేర్కొన్నారు. సంగీత ప్రధాన చిత్రాలను అందించేందుకు ఈ పరిచయం దోహదపడిందని తెలిపారు.