నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత నటిస్తోన్న సినిమా ఎన్బీకే 107. ఈ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాకు యువ దర్శకుడు మలినేనీ గోపీచంద్ దర్శకుడు. రవితేజతో క్రాక్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత గోపీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అఖండ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బాలయ్యకు జోడీగా అందాల భామ శృతీహాసన్ నటిస్తుండగా… కోలీవుడ్ క్రేజీ భామ వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా మెప్పిస్తున్నాడు. బాలయ్య డ్యూయెల్ రోల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా స్టిల్స్, పోస్టర్లు అయితే మామూలు హైప్ క్రియేట్ చేయలేదు. ఇక టైటిల్ విషయంలో ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి.
జై బాలయ్య, రెడ్డి గారు అన్న పేర్లు బయటకు వచ్చాయి. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసేశారు. వీరసింహారెడ్డి అన్న టైటిల్ డిసైడ్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న సినిమా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. థమన్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో మామూలు అంచనాలు లేవు. ఇక టైటిల్ ఈ రోజు రాత్రి ఎనౌన్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
బాలయ్యకు సింహా, రెడ్డి అన్న టైటిల్స్ ఎంతలా కలిసి వస్తాయో ? ఎంత మంచి సెంటిమెంట్లో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఆ రెండు కలిసి వచ్చేలా వీరసింహారెడ్డి టైటిల్ ఫిక్స్ చేయడంతో ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్టే అంటున్నారు. ఇక ఈ సినిమాకు ఈ క్రేజీ టైటిల్ పెట్టింది దర్శకుడు మలినేని గోపీయే అట. సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని అదే టైటిల్ పెడితే బాగా రీచ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టినట్టు తెలిసింది.