ఒకప్పటి మేటి నటుల్లో రజనీ కూడా ఒకరు. 1980-90వ దశకంలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఆమె కెరీర్‌లో మంచి హిట్లు పడ్డాయి. రాజేంద్రప్రసాద్ – రజనీ కాంబినేషన్లో సినిమా అంటే సూపర్ హిట్టే. అప్పట్లో రజనీకి, రాజేంద్ర ప్రసాద్‌కు మధ్య ఏదో నడుస్తుందన్న ప్రచారం కూడా నడిచింది. రజనీకి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు ఎవ్వరూ లేకపోడంతో ఆమె పూర్తిగా దర్శకరత్న దాసరి నారాయణరావు మీద ఆధారపడిపోయింది.
తన డేట్లు చూసే బాధ్యత రజనీ దాసరికి అప్పగించేసింది. అందుకే రజనీ ఏ సినిమాలో అయినా చేయాలంటే దాసరి ఓకే చెపితేనే ఆమె హీరోయిన్‌గా బుక్ అయ్యేది. అయితే ఆమె కెరీర్‌కు ఇది కొంత వరకు ప్లస్ కాగా…. కొంత మైనస్ కూడా అయ్యింది. దాసరితో ఉండడం వల్ల మంచి సినిమాలు అయితే ఆమెకు దక్కాయి. అలాగే దాసరి దర్శకత్వంలో మజ్ను లాంటి హిట్ సినిమాలో కూడా నటించింది.
అయితే రజనీని ఓ సినిమా షూటింగ్‌లో ఓ నిర్మాత పిస్టల్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించిన సంఘటన జరిగింది. ఆ సినిమా పేరు మేనమావ. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు తనయుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి హీరో. ఓ రోజు షూటింగ్‌కు లేట్‌గా వచ్చిన రజనీ షూటింగ్ చేయకుండానే కారులో వెళ్లిపోతోంది. వెంటనే ఆమెను త్రివిక్రమరావు కారు ఆపమని చెప్పారు.
షూటింగ్ ఎందుకు చేయట్లేదని త్రివిక్రమ్‌రావు ప్రశ్నించగా.. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని.. డబ్బులు ఇస్తేనే షూటింగ్ చేస్తానని రజనీ దురుసుగా సమాధానం చెప్పిందట. షూటింగ్‌కు ఇబ్బంది కలిగించవద్దని… నీ షూటింగ్ కంప్లీట్ చేసి సాయంత్రం నీ అమౌంట్ తీసుకువెళ్లమని చెప్పారట. అయినా రజనీ నో చెప్పి కారు డోర్ వేసుకునే ప్రయత్నం చేసిందట.
కోపం పట్టలేకపోయిన త్రివిక్రమరావు వెంటనే తన పిస్టల్ తీసి షూటింగ్ పూర్తి చేయకుండా వెళితే నిర్మాతకు ఎంత నష్టం… వీళ్లందరి కాల్షీట్లు మళ్లీ దొరకవు.. కదిలితే కాల్చి పడేస్తా అని వార్నింగ్ ఇచ్చారట. వెంటనే బెదిరిపోయిన రజనీ షూటింగ్ పూర్తి చేసిందట. ఆ రోజు సాయంత్రమే త్రివిక్రమరావు ఆమెకు బ్యాలెన్స్ మొత్తాన్ని క్లీయర్ చేసి పంపేశారట.
ఇండస్ట్రీలో నీవ్వు కరెక్టుగా షూటింగ్‌కు వచ్చి.. నీకు రావాల్సిన డబ్బులు తీసుకోవడంలో తప్పులేదు.. షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చి నిర్మాతలను, తోటి నటులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే నీకు ఛాన్సులు లేకుండా చేస్తానని.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చి పంపారట. అయితే ఆ తర్వాత రజనీకి ఛాన్సులు రాకపోవడంతో ఆమె కెరీర్ అలా క్లోజ్ అయిపోయింది. రజనీ సినీ కెరీర్‌లో ఇదో మాయని మచ్చగా మిగిలిపోయింది.