Moviesరెండు సినిమాలకే టాలీవుడ్ వదిలేసిన నగ్మా చెల్లెలు.. వాళ్ల టార్చ‌ర్ వ‌ల్లేనా...!

రెండు సినిమాలకే టాలీవుడ్ వదిలేసిన నగ్మా చెల్లెలు.. వాళ్ల టార్చ‌ర్ వ‌ల్లేనా…!

రెండు సినిమాలకే టాలీవుడ్ వదిలేసిన నగ్మా చెల్లెలు..! అవును తెలుగులో మంచి ఫ్యూచర్ ఉన్నా కూడా రెండు సినిమాల తర్వాత అడ్రస్ లేకుండాపోయింది. దీనికి కారణం మన దర్శకనిర్మాతలు, హీరోలు అని అప్పట్లో బాగా టాక్ వినిపించింది. కాస్త అటు ఇటుగా నగ్మా, జ్యోతిక పోలికలతో ఉన్న రోషిణి అసలు పేరు రాధిక సదనా. తెలుగు, తమిళ భాషలలో సినిమాలు చేసింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరస‌న‌ నటించింది. తెలుగులో రోషిణి నటించిన రెండు సినిమాలు మంచి కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి.

 

ఈ సినిమాల కంటే ముందు సెల్వా దర్శకత్వం వహించగా వచ్చిన తమిళ కామెడీ సినిమా శిష్యా సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. సోదరి అయిన నగ్మా ప్రోత్సాహంతో రోషిణి మొదటిసారి తమిళ స్క్రీన్ మీద కనిపించింది. ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతోనే తెలుగులో మాస్టర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. సాధారణంగా ఇద్దరు పెద్ద స్టార్ హీరోల సరసన గనక నటిస్తే ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా పాతుకుపోతారు. కానీ, రోషిణి మాత్రం రెండు సినిమాల తర్వాత అడ్రస్ లేదు.

బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ కూడా తెలుగులో ఇలా రెండు సినిమాల తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. ఆమె తెలుగులో చేసింది సంతోషం, తప్పుచేసి పప్పుకూడు. ఈ రెండు సినిమాలకే ఇక్కడ కొందరు ఇబ్బంది పెట్టడంతో మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంటే వద్దురా నాయనా అని సర్దుకుందట. భారీ రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా మళ్ళీ తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. రోషిణి కూడా ఇలాగే ఇబ్బందులు ఎదుర్కుందట. మన సౌత్‌లో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్స్ సర్వే కాలేదు.

ఇక్కడ లోలోపల మేకర్స్ కంటే కూడా ఇతరుల వల్ల బాగా ఇబ్బందులను ఎదుర్కుంటుంటారు. ఒక్కసారి హీరోయిన్‌గా తెలుగు తెరపై కనిపిస్తే రాజకీయ నాయకులు, బాడా వ్యాపార వేత్తలు డబ్బు ఆశ చూపించి ఇంకోలా అప్రోచ్ అవుతుంటారు. వాటికి ఒకే చెప్పినవారు కొంతకాలం ఇక్కడ బాగా సర్వే అవుతారు. కమిటవనివారు కనిమరుగైపోతుంటారు. ఆ లిస్ట్‌లోకే రోషిణి, గ్రేసీ సింగ్ వస్తారని చెప్పుకుంటారు. ఇవే కాదు..ఇంకెన్నో ఇబ్బందులను ఇక్కడ ఫేస్ చేస్తున్న హీరోయిన్స్ ఉన్నారు. కానీ, లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి ఏదైనా సరే అని భరిస్తూ వస్తున్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news