భారీ అంచనాల నడుమ గ్రాండ్గా ప్రారంభమైన బిగ్ బాస్ 6 షో రసవత్తరంగా సాగుతుంది. కొట్లాటలు, ఏడుపులు, గిల్లికజ్జాలు, రొమాన్స్ , హగ్గులు, ముద్దులతో కంటెస్టెంట్స్ వాళ్ళకి వచ్చిన విధంగా ఆస్కార్ పెర్ఫార్మెన్స్ లెవెల్ లో గేమ్ ను ఆడుతున్నారు అనే సంగతి ముందు నుంచి అందరికి తెలిసిందే. కాగా ఈ వారం హౌస్ నుంచి ఆరోహి ఎలిమినేట్ అయింది. సండే అంటూ చాలా సరదాగా ఊపు మీద వచ్చిన నాగార్జున మధ్యలో అందరిని ఊపేస్తూ ఫైర్ అయిపోయారు. ఈ క్రమంలోనే గలాటా గీతకు పెద్ద క్లాస్ పీకారు నాగార్జున. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకునే అంత స్థాయికి వచ్చేసింది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనకు తెలిసిందే ప్రతి సండే నాగార్జున హౌస్ లో గేమ్స్ ఆడిస్తారు. ఈసారి కూడా అలాగే ఆడిస్తూ మిస్ అండర్స్టాండింగ్ పై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు . మనకు తెలిసిందే హౌస్ లో ఒక విషయమై చంటిని అందరూ నెగిటివ్ కోణంలో చూస్తున్నారు. హౌస్ మొత్తం ఆయన నెగటివ్ నెగిటివ్ అంటూ దూరం పెడుతున్నారు. ఈ క్రమంలోనే నాగర్జున ఎంటర్ అయ్యి క్లారిటీ ఇద్దాం అని పక్కాగా ఫిక్స్ అయ్యారు. అయితే చంటి విషయంలో కీర్తి చేసిన తప్పును ఆయన ఎత్తి చూపిస్తున్న సమయంలో మధ్యలోకి గలాటగీతూ వచ్చింది . దీంతో నాగార్జున ఫైర్ అయిపోయారు.
” గీతూ వెయిట్.. ఫస్ట్ సీట్ డౌన్.. హే నేను వాళ్లతో మాట్లాడుతున్నాను కదా.. నీకు ఏంటి మధ్యలో ప్రాబ్లం ..నేను మిగతా వాళ్లతో మాట్లాడుతుంటే మధ్యలోకి నువ్వు ఎందుకు వస్తున్నావ్? ఎప్పుడు ఇలాగే చేస్తున్నావ్ నీకు ఇది బాగా అలవాటైపోయింది” అంటూ నాగార్జున టెంపర్ లాస్ అయిపోయి ఓ విధంగా ఊగిపోయారు. దీంతో హౌస్ లోని కంటెస్టెన్సే కాకుండా టీవీ ముందు జనాలు కూడా షాక్ అయిపోయారు. అప్పుడు గీతూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చునేసింది. ఇక కీర్తితో పాటు ఇంట్లో వాళ్ళందరూ చంటి తప్పులేదు అంటూ నాగార్జున వీడియో చూసిన తర్వాత రియలైజ్ అయ్యారు. అంతేకాదు గీతూ మాత్రం తప్పంటూ వారిస్తూ వచ్చింది .ఈ క్రమంలోనే గీతూ ఏడుస్తూ చంటి నేను కూరగాయలు కట్ చేస్తే అన్నం తినడం కూడా మానేసాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది “. దీంతో గీతూ చంటిల మధ్య వివాదం ఇంకా అలాగే కొనసాగుతూ వచ్చింది.