Movies"నా కోడలు పిల్ల కి దూరంగా ఉండు".. వెన్నెల కీషోర్ కి...

“నా కోడలు పిల్ల కి దూరంగా ఉండు”.. వెన్నెల కీషోర్ కి నాగార్జున వార్నింగ్..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో కామెడీ రోల్స్ చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిజం చెప్పాలంటే వెన్నెల కిషోర్ ఉంటే ఆ సినిమా హిట్ అయిపోతుందన్న నమ్మకం జనాల్లో ఉంది . అంతటి కామెడీ టైమింగ్ పండించే టాలెంట్ వెన్నెల కిషోర్ కే సొంతం. అంతే కాదు కేవలం కామెడీ రోల్స్ నే కాదు సీరియస్ రోల్స్ లో కూడా మెప్పించిన రికార్డ్లు వెన్నెల కిషోర్ ఖాతాలో ఉన్నాయి .

అయితే ఎప్పుడు ఎవరిని తన మాటలతో హర్ట్ చేయని వెన్నెల కిషోర్ ..మొదటిసారి తన మాటల కారణంగా బాధపడిన హీరోయిన్ కారణంగా అక్కినేని నాగార్జున చేత తిట్టించుకున్నారట. మనకు తెలిసిందే అక్కినేని నాగార్జున వెన్నెల కిషోర్ కాంబోలో చాలా సినిమాలు ఉన్నాయి . కానీ వీళ్ళిద్దరి కాంబోలో లాస్ట్ గా వచ్చిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాలో కృత్తి శెట్టి వెన్నెల కిషోర్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. అయితే ఆ చనువు కారణంగా షూటింగ్ స్పాట్లో వెన్నెల కిషోర్ కృత్తి శెట్టి పై సరదాగా కొన్ని జోక్స్ వేశారట. దీంతో అప్పటికే హర్ట్ అయిపోయిన కృత్తి శక్తి డైరెక్టుగా వెళ్లి నాగార్జునకి చెప్పుకొని బాధపడిందట.

 

వెన్నెల కిషోర్ ఇలా నాపై కామెంట్ చేయడం నాకు నచ్చడం లేదు అంటూ ఆయనకి చెప్పుకొని కన్నీరు పెట్టుకుందట. దీంతో వెన్నెల కిషోర్ ని పిలిపించి నాగార్జున అర్ధమయ్యే విధంగా చెప్పారట.” ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చిన అమ్మాయి.. అలాంటి జోక్స్ ఆ అమ్మాయి తీసుకోలేదు. అయినా అమ్మాయిలపై అలాంటి జోక్స్ ఏంటయ్యా ఇంకోసారి ఇలాంటి జోక్స్ చేసావంటే రెమ్యూనరేషన్ కట్ చేయించేస్తాను..నా కోడలు పిల్లకు దూరంగా” అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారట. దీంతో అప్పటికప్పుడే వెన్నెల కిషోర్ కృతికి సారీ చెప్పారట. మనకు తెలిసందే కృతి బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news